Dharmavaram (Anantapur): ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రధోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. రధోత్సవంలో భాగంగా నూతన అశ్వములు, రథసారధి కోసం తేరు సేవా కమిటీ సభ్యులు, బండ్లపల్లి భాగ్యలక్ష్మి తదితరులు మంగళవారం లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు.

ఈ విరాళాన్ని దేవాలయ కమిటీ చైర్మన్ దాశెట్టి సుబ్రమణ్యంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తేరు సేవా కమిటీ సభ్యులు దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.