Amalapuram Violence: కోనసీమ జిల్లా ఆందోళనలో అమలాపురం భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికార విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం జరుగుతోంది. ఎవరి వాదనలు వారు చెబుతున్నారు. అధికార పక్షంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా ఇది ప్రతిపక్షాల కుట్ర అంటూ అధికార పక్షం పేర్కొంటోంది. అయితే కోనసీమ జిల్లా పేరు మార్పు అంశంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ వాస్తవాలను తెలుసుకోకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని అధికార పక్షం గుర్తించి ఇవి వాస్తవాలు అంటూ ప్రజల ముందు పెట్టింది. ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహనతో మాట్లాడే పవన్ కళ్యాణ్ ఓ రెండు విషయాల్లో ప్రభుత్వంపై పసలేని విమర్శలు చేశారు.
ఇంతకు ముందు జిల్లాల పునర్విభజన సమయంలోనూ ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రాధమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజల నుండి నెల రోజుల వరకూ సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ప్రభుత్వం స్పీకరించింది. ఆనాడు గానీ ఇప్పుడు గానీ ప్రభుత్వ నియమాల ప్రకారమే జిల్లా పేరు మార్పునకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణకు ముందుగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ ఆ విషయాలను గమనించకుండా జిల్లా పేరు మార్పునకు సంబంధించి అభ్యంతరాలు చెప్పుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చారంటే గొడవలు జరుగుతాయని తెలుసునని, కాావాలనే 30 రోజులు గడువు ఇచ్చి కావాలనే గొడవ వాతావరణం సృష్టించేలా ముందుకు తీసుకువెళ్లారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. గతంలో మిగతా జిల్లాలకు కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చినా కానీ వాళ్లకు 30 రోజుల సమయం ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఆరోపణలను అధికార పక్షం కొట్టిపారేస్తోంది.
అదే విధంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు విషయంపైనాై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కారు డ్రైవర్ ను తానే చంపానని అనంత బాబు ఒప్పుకున్నారనీ, వాటిని కవర్ చేసుకోవడానికి. సమర్ధించుకోవడానికి వైసీపీ ఇలాంటి గొడవలు రేపిందని పవన్ కళ్యాణ్ విమర్శించగా దీన్ని అధికార పక్షం తప్పుబట్టింది. ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య, ఎమ్మెల్సీ అరెస్టు వ్యవహారం 20వ తేదీ తరువాత కాగా ప్రభుత్వం జిల్లాకు సంబంధించి ప్రాధమిక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నెల 18వ తేదీ. ఈ రెండు అంశాలపై పవన్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా సరైన వివరణ ఇవ్వలేదని అధికార పక్షం పేర్కొంటోంది.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…