NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: నాకంటే వాళ్లు పెద్ద హీరోలు అంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: వారాహి యాత్రలో భాగంగా కోనసీమలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ముమ్మడివరం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన కంటే  ప్రభాస్, మహేష్ బాబు చాలా పెద్ద హీరోలు అని అన్నారు. వీళ్లతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోలని అన్నారు. తన కంటే వాళ్ల రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువేనని అన్నారు. వాళ్లు తనకంటే చాలా పెద్ద స్టార్లు అని చెప్పడానికి తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని, ఉన్న విషయమే చెబుతున్నానని పవన్ స్పష్టం చేశారు. అయితే రాజకీయాల్లో మాత్రం వాళ్లందరి కంటే తనకే ఎక్కువ అవగాహన ఉందని, ఈ క్రమంలోనే రాష్ట్రాభివృద్ధి కోసం వారంతా కలిసి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Pawan Kalyan Speech in Mummadivaram konasemma dist

 

ఇక వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం 70:30 ప్రభుత్వమని .. వంద మంది కష్టాన్ని 30 మందికి పంచి ఓటు బ్యాంకు చేసుకుని గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుందని విమర్శించారు. ఏపిలో ఉప్మా ప్రభుత్వం నడుస్తొందని ఎద్దేవా చేశారు. కోనసీమలో ఇంకా తాగునీటి సమస్యలు ఉన్నాయన్నారు. ఇక్కడ మంచి ఆసుపత్రి కూడా లేదన్నారు. కోనసీమలో బాలయోగి అనేక మంచి పనులు చేశారనీ, ఒక వ్యక్తి అన్ని మంచి పనులు చేస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని పనులు చేయాలని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేసుల నుండి బయటపడటానికి సీఎం జగన్ ఢిల్లీలోని నేతల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆరు కోట్ల మందిని దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కులం గురించి మాట్లాడితే వైసీపీ నేతలకు ఇబ్బందిగా ఉందనీ, కులం గురించి మాట్లాడేది తానా, వారా అని ప్రశ్నించారు. కులాల గురించి వాళ్లు మాట్లాడవచ్చు గానీ తాను మాట్లాడకూడదా అని అన్నారు. వాళ్లు అమరావతికి కులాలు అంటగట్టవచ్చా అని ప్రశ్నించారు. కేవలం రెండు కులాలే ఆర్ధి వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలంటే కుదరదనీ, అన్ని కులాలు బాగుపడాలన్నారు. నదుల నుండి ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారని, తాము అదికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దోపిడీని అరికడతామన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామనీ, యువతకు పెట్టుబడి కింద ఉచితంగా రూ.10లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ . తాను వస్తున్నాను అంటే రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయన్నారు. కీలకమైన పదవులను రెడ్డి సామాజికవర్గానేక ఇస్తారా.. మితగా కులాల వారికి ప్రతిభ లేదా.. ఒక్క కులానికే ఉందా అని ప్రశ్నించారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడే ఉంటాననీ, వచ్చే ఎన్నికల్లో తనకు అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ కోరారు.

YSRCP: గడప గడపకు సమీక్షలో ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?