NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sajjala Rama Krishna Reddy: ‘చంద్రబాబు కుళ్లికుళ్లి చావడం ఖాయం’

Sajjala Rama Krishna Reddy: అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఈ నెల 24వ తేదీన కృష్ణాయపాలెంలో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలను ఇప్పటికే పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. శరవేగంగా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతోంది. 24న భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో శనివారం ఏర్పాట్లను మంత్రులతో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.

అయితే ఆర్ – 5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి గానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను హోల్డ్ లో పెట్టింది. కోర్టు తీర్పు అనంతరం నిధులు విడుదల చేస్తామని తెలిపింది.

ఈ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇళ్లు కట్టడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఒక సారి స్థలం ఇచ్చిన తర్వాత అక్కడ ఇల్లు కాక ఇంకా ఏమి వస్తుంది, ఆయన చంద్రబాబు దృష్టిలో ఇంకా వేరేది ఏమైనా వస్తాయేమో కానీ ఇక్కడ ఇళ్లే వస్తాయి. ఇళ్లు వస్తాయి కాబట్టి ఇళ్లు కడతాం. ఒక వేళ దీనికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వం సర్వహక్కులను వాడి  దాన్ని నిలబెట్టుకుంటుంది. స్థలం ఇచ్చిన తర్వాత ఇళ్లు కట్టడం నేరం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు.

అన్నిసౌకర్యాలతో పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. పేదలకు మహా అయితే స్థలాలు ఇచ్చారు. రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్లు కట్టించి ఇచ్చే ఏర్పాట్లు చేశారు కానీ ఏ టు జడ్ ఆలోచనతో విశాలమైన రోడ్లుతో ఒక లే అవుట్ ఎలా ఉంటుందో అలాంటిది ప్రభుత్వం పూనుకుని పేదవాళ్లు ఉండటానికి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్లు ఆత్మగౌరవంతో ఉండే రకంగా తీర్చిదిద్దడం జరుగుతోంది. ఆరు నెలల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి అవుతాయి. పేదల ఇళ్ల నిర్మాణంతో రూ.10వేల కోట్ల సంపద ఏర్పడుతుంది. పేదలు కోటీశ్వరులు కావడం ఖాయం. చంద్రబాబు నాయుడు కుళ్లికుళ్లి ఏడ్చి చావడం ఖాయం అని సజ్జల అన్నారు.

దివంగత మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను ఎన్ఐఏ అధికారులు ఎందుకు అరెస్టు చేశారంటే ..?

Related posts

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?