TDP YCP: వైసీీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్, టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. నారా లోకేష్ పై అనిల్ కుమార్ విమర్శలు చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని, మంత్రులను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలనను జగన్మోహనరెడ్డి అందిస్తుంటే నారా లోకేష్ లోకజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు అనిల్.
జిల్లాలోని టీడీపీ నాయకులు చీకటి రాజకీయాలు చేస్తున్నారనీ, టీడీపీ నేతల లాలూచీ వ్యవహారాలను నిరూపిస్తానని సవాల్ చేశారు. నారా లోకేష్ సవాల్ ను స్వీకరిస్తారా అని అనిల్ ప్రశ్నించారు. తనపై 200 కోట్లు దోచుకున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారనీ, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. తాను దోచుకోలేదని కాణిపాకం వినాయకుడి పై ప్రమాణం చేస్తాననీ అన్నారు. వారికి దమ్ముంటే ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. కొందరు టీడీపీ నాయకులు వైసీపీ నేతలతో కుమ్మక్కు అయి చీకటి వ్యవహారాలు నడిపిస్తున్నారని అనిల్ ఆరోపణలు చేయడంతో ఆ నాయకులు ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే అనిల్ విమర్శలపై టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు రియాక్ట్ అయి ట్విట్టర్ వేదికగా మరో సవాల్ విసిరారు.
కేవలం నెల్లూరులోనే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తమతో టచ్ లో ఉన్నారంటూ కాలవ శ్రీనివాసులు బాంబ్ వేశారు. అందులో రోజు నీతో (అనిల్) మాట్లాడే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారని పేర్కొన్న కాలవ శ్రీనివాసులు..ప్రతి రోజు నిన్ను (అనిల్) నీ పార్టీ (వైసీపీ)ని బహిరంగంగా బూతులు తిట్టే ఇంకో ఎమ్మెల్యే ఉన్నారన్నారు కాలవ. దమ్ముంటే నువ్వు మీ జగన్ రెడ్డి గారికి చెప్పి సస్పెండ్ చేయించు అ నిల్లు అని కాలవ ట్వీట్ చేశారు. ఈ ఇద్దరి కామెంట్స్ తో వైసీపీతో లాలూచీ వ్యవహారాలు చేస్తున్న టీడీపీ నేతలు ఎవరు..టీడీపీతో టచ్ లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి ఎవరు అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…