NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Janasena Party: 14న సంచలనాలే – పవన్ పైనే చూపులన్నీ..!

Janasena Party: రేపు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వేదికను ఖరారు చేశారు. అనుమతులు తెచ్చుకున్నారు. ప్లానింగ్ సిద్ధం చేశారు. ఎవరెవరు రావాలి..? వేదిక మీద ఎవరు కూర్చోవాలి..?  సభ ఎంత సేపు నిర్వహించాలి అనే విషయాలను ఖరారు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం కూడా సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ స్పీచ్ ని ముగ్గురు తయారు చేస్తారని సమాచారం. గతంలో మీడియాలో పని చేసి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు పీిఆర్ఓగా ఉన్న హరిప్రసాద్, అలానే త్రివిక్రం శ్రీనివాస్, పవన్ సన్నిహితుడైన మరో సీనియర్ జర్నలిస్ట్ ఇలా ముగ్గురు నలుగురు తయారు చేస్తారు. వీటన్నింటినీ క్రోడీకరించి పంచ్ లు, ప్రాసలు ఉండేలా చూసుకుని దానికి ప్రెపేర్ అయి పవన్ కళ్యాణ్ వేదికపైకి వస్తారు. ఆయన స్పీచ్ చాలా ఆవేశంగా, ఆలోచనా భరితంగా, సిద్ధాంతపరంగా, చాలా డెప్త్ గా ఉంటుంది. ఎప్పుడూ ఆయన ఒక ప్లానింగ్ ప్రకారమే మాట్లాడతారు.

Janasena Party: రాజకీయ వర్గాల్లో ఆసక్తి

రేపు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుంది..? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. జనసేన పార్టీకి సంబంధించి రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. పార్టీ ఏమైనా పొత్తులు మారుస్తుందా..? బీజేపీతో కొనసాగుతుందా..? లేక వేరే పార్టీతో జత కడుతుందా..? జగన్మోహనరెడ్డి ప్రభుత్వ విధానాలపై సానుకూల వైఖరి ఉందా..? వ్యతిరేకంగా ఉన్నారా..? ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ సినిమాలను నూటికి నూరు శాతం వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లానాయక్ సినిమాకు ముందు పెంచాల్సిన సినిమా టికెట్ల రేట్లను ఆ సినిమా రిలీజ్ పూర్తి అయిన తరువాత ప్రభుత్వం పెంచింది. అంటే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి సినీ పరిశ్రమను గుప్పెట్లో పెట్టుకోవాలన్న ప్రయత్నాలు జరిగాయనే మాటలు వినబడ్డాయి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ చూశారు. అందుకే రిపబ్లిక్ మువీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది జరిగి సుమారు ఆరు నెలలు కావస్తోంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు..? ఎలా మాట్లాడతారు..? ఎన్ని పంచ్ లు వేస్తారు..? ఏయే అంశాలు చెబుతారు..? అనేది కీలకమైన అంశం.

 

Janasena Party: వన్ సైడ్ పై లవ్ క్లారిటీ ఇస్తారా..?

దాంతో పాటు టీడీపీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతంలో చంద్రబాబు కుప్పం పర్యటనలో చెప్పారు. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ నేతలు సూచిస్తే వన్ సైడ్ లవ్ అయితే వర్క్ అవుట్ కాదని చంద్రబాబు సెటైర్ వేశారు. పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ ఈ వేదికపై ఏమైనా క్లారిటీ ఇస్తారా..? మాట్లాడతారా..? అనేది మరో ఆసక్తికరమైన అంశం. ఇదే సందర్భంలో చిరంజీవితో సహా పలువురు సినీ పెద్దలు సీఎం జగన్మోహనరెడ్డితో మాట్లాడిన తరువాత దానిపై ఇటీవల పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. దాన్ని ఈ స్పీచ్ లో యాడ్ చేశారు అని కూడా తెలుస్తోంది. అంతే కాకుండా ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా ఇతర నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ బలపడేందుకు అడుగులు వేస్తోంది.

 

Janasena Party: జనసేనతో పొత్తు కొనసాగించాలని బీజేపీ

రాష్ట్రంలో బలపడేందుకు జనసేనతో పొత్తు కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది. మరో పక్క రాబోయే ఎన్నికలను పురస్కరించుకుని ఈ రెండేళ్లు జనసేన జనంలో ఉండాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తారా..? లేదా బస్సు యాత్ర చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కు పాదయాత్ర చేయాలని ఉన్నా ఆయన భద్రత దృష్ట్యా సాధ్యపడదు. ఆయనకు ఉన్న వీరాభిమానులు పాదయాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది. బస్సు యాత్ర, బహిరంగ సభలు లాంటి ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం. రాబోయే సంవత్సరన్నర కాలంలో కనీసం వంద నియోజకవర్గాలు కలిసేలా యాత్ర నిర్వహించి బహిరంగ సభలు పెట్టాలన్నది ఆ పార్టీ ప్లాన్ గా ఉన్న తెలుస్తోంది. వీటన్నింటిపై పవన్ కళ్యాణ్ రేపు జరిగే సభలో ఏమైనా మాట్లాడతారా..? అనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N