NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

అలిపిరి నడక మార్గం చిరుత ప్రమాదాలపై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

Advertisements
Share

తిరుమల అలిపిరి నడక మార్గంలో లక్షిత అనే ఆరేళ్ల బాలికను చిరుత బలి తీసుకున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అలిపిరి నడక మార్గంలో 7వ మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకూ హై అలర్ట్ జోన్ గా టీటీడీ ప్రకటించింది. ఈ హైఅలర్ట్ జోన్ లో ప్రది వంద మంది భక్తులను ఓ బృందంగా పంపిస్తారు. భక్తులకు ముందు భాగంలో, వెనుక బాగంలో రోప్ లతో రక్షణ కల్పిస్తారు. ఈ బృందానికి పైలెట్ గా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.

Advertisements

 

కాగా, టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇవేళ లక్షిత పై చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులపై అధికారులతో ఆయన మాట్లాడారు. జూన్ 22న లాంటి ఘటనే జరిగిన నేపథ్యంలో భక్తుల భద్రత విషయంపై టీటీడీ ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకుందని ఈ సందర్భంగా చైర్మన్ తెలిపారు. తిరుమల కొండపైకి కాలినడకన వచ్చే భక్తులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

Advertisements

అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాలెంకు చెందిన దినేశ్, శశికళ దంపతుల కుమార్తె లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం బాధాకరమని అన్నారు. బాలిక కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని ఆయన తెలిపారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీటీడీ రూ.5లక్షలు, అటవీ శాఖ రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.10లక్షలు లక్షిత కుటుంబానికి అందజేస్తామని చెప్పారు.

Pawan Kalyan: తన పర్యటనలో ఆంక్షలు పెడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం


Share
Advertisements

Related posts

ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్న రేవంత్ రెడ్డి..??

sekhar

RRR – Radhe shyam: పాన్ ఇండియన్ సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ పోస్ట్‌పోన్..అదే జరిగితే ఇండస్ట్రీ మొత్తం నష్ఠాల్లోనే ..!

GRK

సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కుంభకోణం కేసులో మహిళా ఆర్డీఓ అరెస్టు

somaraju sharma