ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya Sai Vs Bandla Ganesh: బండ్ల వర్సెస్ విజయసాయి ట్వీట్ వార్.. ఒకరిపై మరొకరు మరింత ఘాటుగా..

Share

Vijaya Sai Vs Bandla Ganesh: తిరుపతిలో వైసీపీ జాబ్ మేళా సందర్భంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ పై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. ఒక వ్యక్తితో ఉన్న వైరాన్ని కులానికి ఆపాదిస్తే చెప్పుదెబ్బలు ఖాయమని విజయసాయిరెడ్డిని హెచ్చరిస్తూ వరుస ట్వీట్ లు చేశారు. “అన్న కోసం రాష్ట్రం అంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలగిన దుగుల్బాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చేయడం ఖాయం. ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయం” అంటూ విజయసాయిరెడ్డి పై విమర్శనాస్త్రాలు సంధించారు బండ్ల గణేష్.

Vijaya Sai Vs Bandla Ganesh tweet war
Vijaya Sai Vs Bandla Ganesh tweet war

Read More: Prasanth Kishore Meet Sonia: సోనియా, రాహుల్ తో పీకే కీలక భేటీ..పార్టీలో చేరికపై క్లారిటీ వస్తున్నట్లే(నా)..?

Vijaya Sai Vs Bandla Ganesh: బండ్లు ఓడలు కావు

బండ్ల గణేష్ ట్వీట్ల లపై తాజాగా విజయసాయి రెడ్డి మరింత ఘాటుగా స్పందించారు. “ఆకులు..వక్కలు..పక్కలు.. ఇదేగా నీ బతుకు.. అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గానీ బండ్లు ఓడలు కావు. అయ్యో …గణేశా” అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

పోరాడుతూనే ఉంటా..

ఈ విమర్శపైనా తనదైశ శైలిలో స్పందించారు బండ్ల గణేష్. “ఎస్ నేను కుక్కనే కాని దానిలా విశ్వాసం ఉన్నవాడిని. నీలా పిచ్చికుక్కను కాదు తెలుసుకో దొంగ సాయి.. మేము ఏం చేసుకున్నా మా సొంతానికి చేసుకున్నాం కష్టపడ్డాం నీలా దోచుకోలేదు. దొంగ సొమ్ము దోచుకోలేదు. ఒక్కటి గుర్తు పెట్టుకో దొంగసాయి” అంటూ విమర్శించారు. “వైఎస్ జగన్మోహనరెడ్డి గారు అనే వ్యక్తి మీ వెనకాల లేకపోతే నీ చరిత్ర ఏంటో .. నీవు ఏంటో నీ బ్రతుకు ఏంటో ఒక్కసారి కళ్లు మూసుకుని చూసుకో తెలుస్తొంది” అని అన్నారు. “మీ దగ్గర అధికారం ఉంది దొంగసాయి గారూ.. అరెస్టు చేయిస్తారో కేసులు పెట్టిస్తారో.. కొట్టిస్తారో ఇంకెన్నెన్ని చేస్తారో అయినా మీతో నేను పోరాడుతూనే ఉంటా దొంగ సాయి గారు. ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యానవనంలో మొలసిన గంజాయి మొక్క మీరు.. ఆ గంజాయి మొక్కను పీకేసీ ఒక తెలుగువాడిగా నా కర్తవ్యం” అని పేర్కొన్నారు బండ్ల గణేష్. విజయసాయి రెడ్డి, బండ్ల గణేష్ మధ్య జరుగుతున్న ఈ ట్వీట్ వార్ ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో వీరి ట్వీట్ లు వైరల్ అవుతున్నాయి.


Share

Related posts

కరోనా మరియు లాక్ డౌన్ పై రాంగోపాల్ వర్మ వ్యాక్యలు

Siva Prasad

Shanmukh Jashwanth : మరింత చిక్కుల్లో షణ్ముఖ్ జస్వంత్..!!

sekhar

YS Vivekananda Reddy: అవినాష్ రెడ్డికి వైఎస్ వివేకాకు అక్కడే మొదలైంది..! వైఎస్ వివేకా హత్యకు అసలు కారణం..?

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar