NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దమ్ముంటే బాబు కోసమే పనిచేస్తున్నానని షంషేర్ గా చెప్పు పవన్ అంటూ మాజీ మంత్రి పేర్ని సవాల్

Advertisements
Share

వారాహి యాత్రలో జగన్ సర్కార్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై మరో సారి మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఘాటుగా స్పందించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ కు నోటికొచ్చినట్లు ఏదో ఒకటి మాట్లాడి, ప్రజలను రెచ్చగొట్టడం, సీఎం జగన్ పై బురద వేయటం, చంద్రబాబుకు మేలు జరగాలని చూడటం అతనికి బాగా అలవాటైపోయిందని విమర్శించారు. రాజకీయాల్లో ఇంతకన్నా తప్పుడుతనం ఉంటుందా అని ప్రశ్నించారు. 2000లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే జై తెలంగాణ నినాదం మొదలయ్యింది. 2001లో టిఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసిఆర్ పార్టీ పెట్టి జై తెలంగాణ నినాదంతో ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయితే.. దానికీ జగన్ కి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. జనం నవ్వుకుంటున్నారన్న కనీస ఆలోచన కూడా లేకుండా పచ్చి అబద్ధాలు పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడని అన్నారు. రాష్ట్ర విభజన గురించి పవన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారనీ, వైఎస్ రాజశేఖరెడ్డి వల్లే విభజన జరిగినట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

Advertisements

 

చంద్రబాబు వద్ద పవన్ కల్యాణ్ కిరాయికి ఒప్పుకున్నాడు.. కూలీ తీసుకుంటున్నాడు. కూలీకి తగ్గట్టుగా పనిచేయడమే పవన్ కు తెలుసు తప్ప వాస్తవాలు, విచక్షణతో అతనికి పని లేదు. అని పేర్ని విమర్శించారు. ఈ ప్రభుత్వం మీద, సీఎం జగన్ మీద ఉద్ధేశపూర్వకంగా విషం చిమ్మడం, అసత్యాలు మాట్లాడటం తప్ప, ఆయన మాటల్లో వాస్తవాలు ఏమున్నాయ్ అని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర ఒప్పుకున్న ప్యాకేజీ కోసం తప్పితే… పవన్ మాటలకు విలువ ఎక్కడిది..? అని అన్నారు. చంద్రబాబు కోసమే పనిచేస్తానని దమ్ముంటే.. షమ్ షేర్ గా చెప్పొచ్చు కదా అని సవాల్ చేశారు. కొద్ది సేపు నేనే ముఖ్యమంత్రి అవుతానంటావ్…మరి కొద్ది సేపు నేను ముఖ్యమంత్రిని ఎలా అవుతానని అంటావ్. ఎన్ని సీట్లలో పోటీ చేస్తావ్.. అంటే అది మాత్రం నాకు తెలియదంటావు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా,  ప్రజలకు నిజాయితీతో బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పండన్నారు.

Advertisements

తణుకు, తెనాలిలో అభ్యర్ధులను ప్రకటించావు, మరి మిగతావి ఎందుకు ప్రకటించవు, 175 సీట్లలో పోటీ చేస్తున్నావా.. లేదా..? అని ప్రశ్నించారు. మీరు ఎంత మంది వచ్చినా మాకు లెక్కలేదని అన్నారు పేర్ని. ఎన్నికల దాకా ముసుగు వేసుకుని.. అప్పుడు కలిసి పోటీ చేయడం.. ఎవరికి తెలియని విద్యలు ఇవన్నీ.. అని అన్నారు. పవన్ కళ్యాణ్ 25-30 సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీచేయడని అందరికీ తెలుసునని అన్నారు. పార్లమెంటుకు ఒక సీటు పోటీ చేసి, నీవు ముఖ్యమంత్రివి అవుతావా అని ప్రశ్నించారు. వాలంటీర్ల పై రోజుకొక మాట, పూటకొక మాట చెబుతావ్ అని విమర్శించారు. సామాజికవర్గం ఓట్లను పొట్లం కట్టి బాబుకు అమ్మేయడమే పవన్ స్కీమ్ అని దుయ్యబట్టారు.

సీఎం జగన్ పై లేనివి ఉన్నట్టుగా చెప్పడానికి ప్రధాని మోదీ, అమిత్ షా దగ్గరికి వెళ్తావ్ కానీ ఒక్కరోజు అయినా మోడీని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని, ప్రత్యేకహోదా ఇవ్వాలని  అడిగావా..? అని ప్రశ్నించారు. పవన్ కుట్రను సామాజికవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు గనుకే.. రెండు చోట్ల ఓడించారన్నారు. ఇంతకు ముందు వేరే పార్టీ నుండి నాయకులను చేర్చుకోను అని ఈరోజు ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారా అని టాటా మ్యాజిక్ వాహనాలు పెట్టినట్టు.. రండి.. రండి అని పిలుస్తున్నావ్ అని విమర్శించారు. తప్పుడు మాటలు… అసత్యాలు ఇకనైనా కట్టిపెట్టాలని పేర్ని నాని  హెచ్చరించారు.

TTD: భక్తుల ప్రాణరక్షణే ధ్యేయంగా కీలక నిర్ణయాలు – చైర్మన్ భూమన


Share
Advertisements

Related posts

దుబ్బాక లో కే‌సి‌ఆర్ కి ఓటమి తధ్యం అని నిరూపిస్తున్న లేటెస్ట్ సాక్ష్యం ఇదే ?? 

sekhar

penis: మీ పురుషాంగం పట్ల ఈ తప్పులు చేస్తున్నారా??

siddhu

Delta: షాక్ఃవంద దేశాల్లో డెల్టా వేరియంట్ క‌ల‌క‌లం…

sridhar