NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టార్గెట్ చంద్రబాబు: కుప్పం వైసీపీ ఇన్ చార్జి భరత్ కు మంత్రి పదవి ఖాయం చేసిన సీఎం వైఎస్ జగన్

కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి, ఎమ్మెల్సీ భరత్ కు మంత్రి పదవిని ఖాయం చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. వైసీపీ కార్యకర్తల భేటీలో భాగంగా గురువారం సాయంత్రం మొదటగా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుండి 50 మంది నేతలతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశాల ఉద్దేశాన్ని వివరించిన జగన్.. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించాలని సూచించారు. నియోజకవర్గ నేతలు చెప్పిన విషయాలను ఆలకించారు.

 

అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో కంటే గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుండే మొదలు కావాలని జగన్ పిలుపునిచ్చారు. కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమన్నారు. కుప్పం నుండి భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని వాగ్దానం చేశారు. ఈ సమావేశ సందర్భంలోనే కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి రూ.65 కోేట్ల విలువైన పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కుప్పం అభివృద్ధికి పూర్తి స్థాయిలో అండగా ఉంటానని చెప్పారు. నేరుగా కార్యకర్తలు, నేతలతో సీఎం జగన్ భేటీ కావడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju