NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే కన్ఫర్మ్డ్ ..! ఎవరంటే..?

YSRCP: ఏపి పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు ఖాళీ అయ్యింది. ఇప్పటికే అసెంబ్లీ అధికారులు సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు తెలియజేశారు. ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఆనవాయితీ ప్రకారం మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబంలో నుండే ఒకరిని సీఎం జగన్ అభ్యర్ధిగా ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యే అకాలమరణంతో జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

YSRCP atmakur mla candidate confirmed
YSRCP atmakur mla candidate confirmed

 

YSRCP: ఉప ఎన్నికల్లో పోటీకి విపక్షాలు దూరం

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివాద రహితుడుగా, అందరి వాడుగా పేరు పొందడంతో ఉప ఎన్నికల్లో పోటీకి విపక్షాలు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ కొంత బలంగా ఉన్నప్పటికీ సంప్రదాయాన్ని అనుసరించి టీడీపీ పోటీ చేయదు. ఇటీవల బద్వెేల్ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన పోటీ చేయలేదు. ఆత్మకూరు విషయంలో టీడీపీ, జనసేన అదే స్టాండ్ పై ఉండే అవకాశం ఉంది. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినా నామమాత్రంగానే ఓట్లు వచ్చాయి. ఆత్మకూరులోనూ బీజేపీ పోటీ చేసి మరో సారి చేతులు కాల్చుకునే పరిస్థితి ఉండదు అని అంటున్నారు.

 

గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్ధి..?

గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి వయసు మీద పడటంతో ఉప ఎన్నికకు ఆయన సుముఖత వ్యక్తం చేయరు. గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి విద్యాభ్యాసం పూర్తి కాలేదు. చిన్న వయస్సు కావడంతో గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డిని వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. శ్రీకీర్తిరెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలని జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకీర్తి రెడ్డి అయితేనే ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని పార్టీ నెల్లూరు జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు. గౌతమ్ రెడ్డి ధశదిశ కర్మ పూర్తయిన తర్వాత దీనిపై కుటుంబ సభ్యుల నుండి పార్టీ అధిష్టానం ఒక క్లారిటీ తీసుకుని శ్రీకీర్తిరెడ్డిని వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. గత సంప్రదాయాలను గౌరవిస్తూ విపక్షాలు కూడా పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి శ్రీకీర్తి రెడ్డి ఎమ్మెల్యేగా ఏకగ్రీవం అవ్వనున్నారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri