NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు…!!

ఐపీఎల్ నిర్వాహకులకు షాక్ ఇచ్చింది చైనా మొబైల్ ఫోన్ల కంపెనీ. స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్న చైనీస్ మొబైల్ కంపెనీ వివో దెబ్బకి ఐపీఎల్ 2020 నిర్వాహణ విషయంలో బీసీసీఐకి దిమ్మతిరిగి నట్లయింది. దీంతో ఐపీఎల్ ఈ ఏడాది కొత్త స్పాన్సర్ విషయంలో బీసీసీఐ వెతుకులాట మొదలుపెట్టినట్లు సమాచారం. చైనా ఇండియా సరిహద్దుల వద్ద చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణం వలన చైనా యాప్స్ పై భారత్ నిషేధం విధించిన నేపథ్యంలో ఐపీఎల్ మెయిన్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుంటున్నట్లు చైనీస్ మొబైల్ కంపెనీ వివో ప్రకటించింది. దాంతో ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరిగే ఈ టోర్నమెంట్ కి కొత్త స్పాన్సర్ విషయంలో బిసిసిఐ వెతుకులాట స్టార్ట్ చేసింది.

IPL 2020: Protests simmer after BCCI retains Chinese company Vivo ...

స్వచ్ఛందంగానే అంటున్న వివో…

బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ట్రోఫీ మెయిన్ స్పాన్సర్ పక్కకి తప్పుకోవటంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అప్పట్లో బీసీసీఐ తో ఐదు సంవత్సరాల కాలపరిమితి కోసం 2022 వరకు స్పాన్సర్ షిప్ హక్కుల కోసం వివో కంపెనీ దాదాపు 440 కోట్ల రూపాయలను బీసీసీఐకి పేమెంట్ చేసింది. అయితే ఇటీవల చైనా – భారత్ సరిహద్దు ప్రాంతాల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో… ఈ స్పాన్సర్ షిప్ నుంచి స్వచ్ఛందంగానే తప్పుకుంటున్నట్లు వివో తెలిపింది. ఎప్పుడైతే భారత్-చైనా మధ్య గొడవలు చోటు చేసుకోవటంతో సోషల్ మీడియాలో చైనా వస్తువుల పై తీవ్రస్థాయిలో దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావటంతో కేంద్రం చైనా యాప్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

రాజకీయంగా బీసీసీఐ పై వ్యతిరేకత…

పరిస్థితి ఇలా ఉండగా ఐపీఎల్ 2020 షెడ్యూల్ బీసీసీఐ ప్రకటించడంతో ఐపీఎల్ లో మెయిన్ స్పాన్సర్ షిప్ గా ఉన్న చైనా కంపెనీ వివో పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, చైనా ప్రీమియర్ లీగ్ అంటూ విమర్శలు  దేశవ్యాప్తంగా స్టార్ట్ అయ్యాయి. మన దేశ సైనికుల ను పంపుతున్న చైనా కంపెనీలకు ఎక్కడ దేశంలో చోటు ఉండకూడదని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల నుండి కూడా విమర్శలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా బీసీసీఐ పై కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బిజెపి, ఆర్ ఎస్ ఎస్ దాని అనుబంధ సంస్థలు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాయి.

దెబ్బకి దుకాణం సర్దేస్తున్న వివో ?… 

పరిస్థితి ఇలా ఉన్నప్పుడు తప్పుకోవడమే బెటరని స్వచ్ఛందంగా వివో ఐపీఎల్ భాగస్వామి నుండి తప్పుకొంది. అంతేకాకుండా ఇండియాలో కంపెనీకి సంబంధించిన ఫోన్ల అమ్మకాలు కూడా ఆపేయాలనే ఆలోచనలో వివో ఉన్నట్లు టాక్. చాలా దూకుడుగా సరిహద్దు ప్రాంతాలలో చైనా ఆర్మీ వ్యవహరించి ఇండియన్ సైనికులను 20 మందిని చంపేయడం తో… చైనా వస్తువుల పై ఉత్పత్తులపై భయంకరమైన వ్యతిరేకత దేశంలో ఉంది. దీంతో ఏకంగా వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో ఇండియాలో అమ్మకాలే ఆపేయడం బెటర్ అనే ఆలోచనలో వివో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ నుండే కాదు త్వరలో ఇండియా నుండే వివో దుకాణం సర్దుకోవటం గ్యారెంటీ అనే టాక్ వినబడుతోంది. 

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N