Nara Lokesh: శెభాష్ లోకేష్..! “ప్రత్యర్ధులు ఉడికించిన పప్పు.. వారికే గొంతుదిగడం లేదు”..!

Nara Lokesh: Shocking Changes
Share

Nara Lokesh: పప్పు అన్నవాడు పప్పు కాదు.. పప్పు కానివాడు పప్పు కాబోడు…! దేశంలో/ రాష్ట్రంలో పప్పు అంటే రాజకీయమే. నచ్చని వాడు, ప్రత్యర్థి పార్టీ వాడు పప్పు అయిపోతాడు. ఈ వెరైటీ సంప్రదాయానికి, నామధేయానికి కొన్నేళ్ల కిందటే వైసిపి తెరతీసింది.. కానీ పప్పుని సహజంగా పండిస్తేనే “పనికొస్తుంది”. కానీ కృత్రిమంగా దురుద్దేశంతో తయారు చేస్తే “పైకొస్తుంది”.. రాజకీయంగా రాటుదేలి వారికె చమటలు పట్టిస్తుంది.. “ప్రత్యర్ధులు డప్పులు కొట్టిన.., కృత్రిమంగా సృష్టించిన పప్పు కుంగిపోవడం మానేసి పోరాటం నేర్చుకుంటుంది.. తనను తాను మలుచుకుంటుంది.. పార్టీపై పట్టు పెంచుకుంటుంది.. జనంలో బలం కోసం ప్రణాళికలు వేస్తుంది” ఇదే నారా లోకేష్ చేస్తున్నది.. ఇదేదో ఆషామాషీగా చెప్తున్న వ్యవహారం కాదు. నారా లోకేష్ ని దగ్గరగా పరిశీలిస్తే పూర్తి స్థాయిలో నాయకుడిగా ఎదిగాడు / పరిపక్వమయ్యాడు అని చెప్పలేం కానీ.., చాలా నేర్చుకున్నాడు.. ఇంకా నేర్చుకుంటున్నాడు అని మాత్రం చెప్పుకోవచ్చు..

Must Read it: సోషల్ మీడియాలో ఇంకా ఎంత మందిని చంపేస్తారో..!? 

Nara Lokesh: Shocking Changes Since Year
Nara Lokesh: Shocking Changes Since Year

Nara Lokesh: ఏడాదిలో ఏమిటీ మార్పులు..!?

లోకేష్ లో గత ఏడాది నాటికీ.., ఈ ఏడాది కీ కొన్ని తేడాలు స్పష్టంగా గమనించవచ్చు. * మనిషి రూపం మారింది. గతంలో వయసుకి మించిన బరువు, వయసుకి సంబంధం లేని రూపంతో నారా లోకేష్ కనిపించేవారు. కానీ ఏడాది కాలంలో 32 కిలోలు తగ్గారు. 100 కిలోలలకు అటూ ఇటుగా ఉండే లోకేష్ ఇప్పుడు 65 – 70 మధ్యలో ఉన్నారు. * మాటల్లో రాటుదేలారు. గతంలో పది మాటల్లో రెండో, మూడో తడబడేవి. అలా దొర్లిన తప్పులతో సోషల్ మీడియాకు దొరికిపోయేవారు. కానీ ఇప్పుడు పది మాటల్లో సగటున ఒకటి మాత్రమే తడబడుతున్నారు. వెంటనే సరి చేసుకుంటున్నారు. ఇది ఎవరికైనా సహజమే. సూటిగా, స్పష్టంగా మాట్లాడడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. చంద్రబాబు 45 నిమిషాల్లో చెప్పే అంశాన్ని లోకేష్.. సూటిగా 20 నిమిషాల్లో ముగిస్తున్నారు..! * ప్రత్యేక అంశాలను భుజాన వేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పోరాడగలుగుతున్నారు. పరీక్షల అంశమే ఉదాహరణ… * మీడియాకు ఎదురు నిలబడడం.. గతంలో మీడియా అడిగే ప్రశ్నలకు దాగుడు మూతల సమాధానాలిచ్చేవారు. దొరికిపోయేవారు. ఇప్పుడు మాత్రం మీడియాతో ముచ్చటిస్తున్నారు. అన్నిటికీ మించి తన ప్రతీ ప్రెస్ మీట్ లోనూ సాక్షితో ప్రత్యేకంగా “ఏం సాక్షి ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా..!? అంటూ వారికి చురకలు పెడుతున్నారు. * పార్టీలో అంతర్గతంగానూ నాయకులకు ఎక్కువ సమయం ఇస్తున్నారు. తనను కలవడానికి వచ్చిన నాయకులకు ప్రత్యేక సమయాన్ని కేటాయించి, వారు చెప్పేది వింటున్నారు. (కానీ నాయకుల సూచనలు మంచివైనా పాటించే స్థితిలో లేరు). * పార్టీలో ఆపద ఉన్నవారికి సాయం చేయడానికి ఆలోచించడం లేదు. ఈ మార్పులతో లోకేష్ ప్రస్తుతానికి పార్టీలో వరకు మంచి పేరునే పొందుతున్నారు.. సహచర నాయకుల అభిమానం చూరగొంటున్నారు.. సెల్ఫ్ లెర్నింగ్ ద్వారానే కొంత మేరకు ప్రగతి సాధించారు.. కొత్త లోకేష్ ని బయటకు తీశారు.. కానీ….

Read it : ఏడాది కిందట లోకేష్ గురించి “న్యూస్ ఆర్బిట్” ఏం రాసింది..!? 

Nara Lokesh: Shocking Changes
Nara Lokesh: Shocking Changes

నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదు. కార్యకర్తలు చెప్పేది సీరియస్ గా తీసుకోవడం లేదు. తను ఒక టీమ్ సెట్ చేసుకుని, వాళ్ళు చెప్పేదే తనకు భగవద్గీత, వేదం, పురాణాల్లా చూస్తున్నారు. కొత్తగా ఆలోచించకుండా.., మూసగా తన సొంత ధోరణిలోనే వెళ్తున్నారు.

దెబ్బలు తినాలి.., ఆలోచన మెరుగవ్వాలి..!!

నాయకుడు అంటే సరిగ్గా మాట్లాడితే చాలదు.., కానీ బాగా మాట్లాడగలగాలి..! నాయకుడు అంటే అందరితో సఖ్యతగా ఉంటే చాలదు.., కానీ అందరితో సఖ్యతగా మెలగాలి..! సాయం చేయడం, అందుబాటులో ఉండడం, శరీరాకృతి చక్కగా చూసుకోవడంతో సరిపోదు..! “ఆలోచన తీరు మెరుగవ్వాలి. అది సహజంగా అలవడాలి. అంటే పొలిటికల్ పజిల్స్ లో ఇరుక్కుని, స్వయంగా ఛేదించడం తెలుసుకోవాలి.. రాజకీయాల్లో ఏ నాటి నుండి పేరుకుపోయిన కన్నింగ్ మైండ్ ఉండాలి, అవసరానికి వాడాలి.. రాజకీయాల్లో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్న క్రిమినాలిటీ కూడా అవసరాన్ని బట్టి అలవాటు చేసుకోవాలి.. మనుషుల్ని, ఎదుటి మనిషి మెదడుల్ని చదవగలగాలి.., నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి.. దెబ్బలు తినడానికి సిద్ధపడాలి..! ఎదుటి వారు వేయబోయే అడుగులను ముందుగానే గ్రహించి.. దానికి విరుగుడు అలోచించి పెట్టుకోవాలి.. తనపై తనకు నమ్మకం ఎక్కువ పెట్టుకుంటూనే.. ప్రత్యర్థి తన కంటే బలవంతుడని లోలోపల అనుకోవాలి..! ఈ లక్షణాలన్నీ ఒక నాయకుడిలో ఉంటె రాజకీయంగా సుదీర్ఘకాలం ఏలవచ్చు. వీటిలో కొన్ని ఉన్నా నెట్టుకుని రావచ్చు.. ఏమి లేకపోతేనే ఏడాది కిందట నారా లోకేష్ అనుకోవచ్చు.. సో.., ఏడాదిలో లోకేష్ లో మార్పులు చూసాం. చూద్దాం.., మరింత రాటుదేలుతారో.., ఇప్పటికే చాలా నేర్చుకున్నామని సరిపెడతారో..!?


Share

Related posts

జగన్ సంచలన నిర్ణయం..! భూములు, ఆస్తులు కొనాలనుకుంటున్న వారు త్వరపడండి

arun kanna

KCR: కేసీఆర్ కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ నేత‌లు ఏ చాన్స్ వ‌దులుకోవ‌ట్లే

sridhar

GHMC ఎన్నికల విషయంలో తెలంగాణ ఈసీ కీలక నిర్ణయం..!!

sekhar