NewsOrbit
బిగ్ స్టోరీ

మరణశిక్ష మీద సుప్రీం కోర్టు పిల్లిమొగ్గలు!

క్రితం వారం మంగళవారం నాడు ఐదుగురి హత్యకి సంబంధించి 2009లో ఆరుగురి ముద్దాయిలకు విధించిన మరణశిక్షను ప్రాసిక్యూషన్‌లో లొసుగులు ఉన్నాయన్న కారణంతో సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. గత అనేక సంవత్సరాలలో కోర్టులు మరణశిక్ష విధించిన, రద్దు చేసిన విధానాలపై ఈ తీర్పు వెలుగుని ప్రసరించింది.

భారతదేశంలో వివిధ చట్టాల కింద 46 నిబంధనల ప్రకారం మరణశిక్ష అమలులో ఉంది. న్యాయపరమైన పొరపాటు అనే అవకాశం దీనికి అంతర్గతం. “తను చెయ్యని తప్పుకి ఎవరినైనా ఉరి తీయటం అనేది ఘోరమైన విషయం. అటువంటి సందర్భంలో చట్టమే హంతకురాలు.” అని బ్రిటిష్ న్యాయ నిపుణుడు హెచ్.ఎల్.ఏ హార్ట్ అన్నారు.

మరణశిక్ష పడిన తరువాత 26 నెలల పాటు జైలులో ఉన్న భారత రాజ్యాంగ మండలి సభ్యుడు శిబ్బన్ లాల్ సక్సేనా 1949లో వాదిస్తూ ఆ సమయంలో ఉరి తీసిన 37 మందిలో ఏడుగురు అమాయకులు అని పేర్కొన్నారు. మరణశిక్షని రద్దు చెయ్యాలని బి.ఆర్.అంబేద్కర్ వాదించారు. కానీ రాజ్యంగ మండలి ఈ విషయాన్ని సుప్రీం కోర్టు, పార్లమెంట్ విజ్ఞతకి వదిలేసింది. చివరికి పార్లమెంట్ కానీ న్యాయవ్యవస్థ కానీ మరణశిక్షని రద్దు చెయ్యలేకపోయాయి. లా కమీషన్ (1967) 35వ నివేదిక మరణశిక్షని కొనసాగించాలి అని సిఫార్సు చేసింది.

కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1973) ప్రకారం జీవిత ఖైదుని కాదని మరణశిక్ష విధించాల్సివస్తే అందుకు “ప్రత్యేక కారణాలు” చూపాల్సిన అవసరం ఉంది. అదే పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1898) ప్రకారం మరణశిక్ష విధించకపోతే కారణాలు చూపించాల్సి ఉండేది. ఈ అవసరాన్ని 1955లో తొలగించారు. ఉరితియ్యటంతో పాటు ప్రాణాంతక సూది మందు ఇవ్వాలని లా కమీషన్ (2003)187వ నివేదిక సిఫార్సు చేసింది.

మరణశిక్ష అనేది “నిర్హేతుకంగా, అసాధారణంగా” విధిస్తున్నారు అని సుప్రీం కోర్టే సంతోష్ కుమార్ బరియార్ (2009) కేసులో పేర్కొన్నది. “మరణ శిక్ష విధించిన పూర్వపు కేసులలో దీనికి సంబంధించి ఎటువంటి ఏకరూపత లేదు” అని కూడా పేర్కొంది . అలాగే మరొక్కసారి సంగీత్ (2013) కేసులో “ ‘సూత్రబద్ధ శిక్ష’  కాస్త ‘న్యాయమూర్తి కేంద్రం’ గా మారిపోయింది” అని కోర్టే ధృవీకరించింది. మరణశిక్ష విధించటం అనేది “న్యాయమూర్తుల వ్యక్తిగత ప్రాధాన్యతల” మీద ఆధారపడి ఉంటున్నదని స్వామీ శ్రద్ధానంద్ (2008) కేసులో సుప్రీం కోర్టు పేర్కొన్నది. “మరణశిక్ష విధింపు భిన్న వ్యాఖ్యానాల బరువుతో కుప్పకూలిపోతున్నది” అని మహమ్మద్ ఫరూక్(2010) కేసులో కోర్టు పేర్కొంది.

న్యాయమూర్తులకు దఖలు పడిన విస్తృత న్యాయ విచక్షణ రాజ్యాంగంలోని  14వ అధికరణకి ఉల్లంఘన కాదు అని పేర్కొంటూ జగ్మోహన్ (1972) కేసులో మరణశిక్ష రాజ్యంగబద్ధతని సుప్రీం కోర్టు సమర్ధించింది. కానీ “వ్యక్తిగత ప్రాధాన్యతల”కీ, తాత్కాలిక మూడ్‌కీ చావుబ్రతుకుల సమస్యను వదిలివేయలేమని ఈడిగ అనమ్మ(1974) కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్(1979) కేసులో ప్రతీకారేచ్ఛ్ శిక్ష పరమార్ధం అనే దానిని నిరాకరించింది. నిరాకరిస్తూ చెప్పింది ఏమిటంటే “ప్రత్యేక కారణాలు” అనేవి నేరస్థులకి సంబంధించి ఉండాలి కానీ నేరానికి కాదు అని పేర్కొంది. బచ్చా సింగ్ (1980) కేసులో మరణశిక్ష రాజ్యాంగబద్ధతను రాజ్యంగ ధర్మాసనానికి నివేదించారు. రాజ్యంగ ధర్మాసనం 4-1 ఆధిక్యతతో మరణశిక్షని సమర్ధించింది. ప్రత్యేక కారణాలు అనేవి ఆ “నేరానికీ”, “నేరస్థులకీ” సంబంధించి అసాధారణ పరిస్థితులయి ఉండాలి అని పేర్కొంది. న్యాయమూర్తులకి దఖలు పడిన  విస్తృత విచక్షణ నిరంకుశం కాదని పేర్కొంటూ వేరే ప్రత్యామ్నాయం ఏమాత్రం కుదరనపుడు “అత్యంత అరుదైన” సందర్భాలలో  మాత్రమే ఉరిశిక్ష విధించాలి అని చెప్పింది. మైనారిటీ తీర్పు ఇచ్చిన జస్టిస్ పి.భగవతి మాత్రం మరణశిక్ష అనేది నిర్హేతుకం, విచక్షణాపూరితం కాబట్టి రాజ్యంగ విరుద్ధం అని చెప్పారు.

ఉరిశిక్షలో ఎటువంటి హింస కానీ అవమానం కానీ లేదు కనుక అది రాజ్యాంగబద్ధమే అని దీనదయాళ్ (1983) కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ పరమానంద్ కటారా (1995) కేసులో, ప్రాణం పాయిన తర్వాత అరగంట సేపు ఉరితాడుకు వేళ్లాడడం పంజాబ్ జైలు మాన్యువల్ ప్రకారం రాజ్యంగ విరుద్ధం అని తీర్పు ఇచ్చింది.

లోక్ పాల్ సింగ్(1985), దర్శన్ సింగ్(1988)  లాంటి అనేక కేసులలో అత్యంత అరుదైన నిబంధన ప్రస్తావన లేకుండానే మరణశిక్ష విధించడం జరిగింది. ముకుంద్(1997), ఫరూక్(2002) కేసులలో దానిని ప్రస్తావించారు కాని పరిగణనలోకి తీసుకోలేదు.

మచి సింగ్(1983) కేసులో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఒక కేసు “అత్యంత అరుదైన” విభాగానికి చెందుతుందా లేదా అనేదానికి ఐదు కొలమానాలను నిర్ణయించింది. అవి నేరం చేసిన తీరు(క్రూరత్వం, ఉద్దేశం, సంఘ వ్యతిరేక లేదా జుగుప్సాకరమైన తీరు), నేర తీవ్రత, బాధితుని వ్యక్తిత్వం (పిల్లలు, మహిళలు, ప్రముఖ నాయకులు), మొదలగునవి. ఈ కొలమానాలు “నేరస్థుడి”కీ, నేరస్థుడిపై దయ చూపించేందుకు తగిన “ఉపశమన కారకాల”కూ  కాకుండా “నేరానికి” ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. బచ్చా సింగ్ కేసులో వీటికి [“నేరస్థులు ”, “ఉపశమన కారకాలు”] కూడా సమ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అందువలన దేవేందర్ పాల్ సింగ్ (2002) కేసులో నేరం జరిగిన పరిస్థితులని బట్టి మరణశిక్ష విధించవలసి వచ్చింది.

అలాగే కోర్టు వివాదాస్పదమైన “ఉమ్మడి అంతరాత్మ” అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. సమాజపు ఉమ్మడి అంతరాత్మ దిగ్భ్రాంతి చెందినప్పుడు, అది న్యాయమూర్తులు మరణ శిక్ష విధిస్తారనే ఆశిస్తుందని పేర్కొంది. ఈ వాదననే తరువాత ధనంజయ్ ఛటర్జీ, అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్ లాంటి  అనేక కేసులలో మరణశిక్ష విధించటానికి ఉపయోగించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే బచన్ సింగ్ తీర్పులో న్యాయమూర్తులు ప్రజాభిప్రాయానికి అధికార ప్రతినిధులుగా ఉండటం తగదు అని కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ ఇలా మరణశిక్ష విధించడం.

న్యాయం కావాలని ప్రజలు చేస్తున్న డిమాండ్ ఒక నిష్పాక్షిక పరిస్థితి కానపుడు దానిని “అత్యంత అరుదైన” కేసుకు కొలమానంగా తీసుకోవడం సరి కాదని సంతోష్ సింగ్ బరియార్ కేసులో కోర్టు పేర్కొన్నది. జగ్మోహన్ కేసులో స్పష్టంగా పేర్కొన్న ‘న్యాయ విచక్షణ’కు  ఈ “సమాజపు అంతరాత్మ” అనేది వ్యతిరేకం అని కోర్టు చెప్పింది. “అత్యంత అరుదైన” సూత్రానికి “సమాజపు అంతరాత్మ”తో నిమిత్తం లేదని మోహిందర్ సింగ్(2013) కేసులో కోర్టు పునరుద్ఘాటించింది.

శిక్ష కానీ నేరస్థుడు కానీ కాకుండా నేర తీవ్రత, నేరంతీరు మాత్రమే న్యాయం కోసం సమాజం చేస్తున్న డిమాండ్‌ని పరిగణలోకి తీసుకోవటానికి వాడాలని రవి సింగ్ అలియాస్ రాం చంద్ర(1996) కేసులో కోర్టు చెప్పింది. బచన్ సింగ్ కేసులో పొందుపరిచిన సూత్రాలకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి రవి సింగ్, ఇంకా ఆరు ఇతర కేసులో ఇచ్చిన తీర్పులు తప్పు అని సంతోష్ సింగ్ బరియార్ కేసులో సుప్రీం కోర్టు చెప్పింది.

కేవలం నేరం మాత్రమే పరిగణలోకి తీసుకుని నేరస్థునికి సంబంధించిన “ఉపశమన కారకాల”ను విస్మరించినందున ధనంజయ్ ఛటర్జీకి విధించిన మరణశిక్షని శంకర్ కృష్ణారావు ఖడే(2013) కేసులో కోర్టు ప్రశ్నించింది. కానీ గుర్వైల్ సింగ్(2013), మోఫిల్ ఖాన్(2015) కేసులలో మరణశిక్ష విధించటానికి ఆ నేరం సమాజపు అంతరాత్మని కుదిపేసిందా లేదా అనేదే నిజమైన గీటురాయి అని కోర్టు చెప్పింది.

ధనంజయ్‌కి మరణశిక్ష 27 సంవత్సరాల వయసులో విధించారు. అదే రమేష్ భాయి రాథోడ్ కేసులో తనకి ఇంకా 28 సంవత్సరాలే కాబట్టి సంస్కరణకి ఇంకా అవకాశం ఉందని భావించి జీవిత ఖైదు విధించారు. పురుషోత్తం దశరథ్(2015) కేసులో కోర్టు మళ్ళీ 26, 20 సంవత్సరాలు వయసు కలిగిన ఇద్దరు ముద్దాయిలకి మరణశిక్ష విధించింది. అందులో ఎక్కడా రమేష్ భాయి రాథోడ్ కేసు ప్రస్తావన లేదు.

మరణశిక్ష అమలు చెయ్యటంలో జరిగే జాప్యం వల్ల చోటు చేసుకునే అనిశ్చితి,ఆశ నిరాశల ఊగిసలాట కారణంగా శిక్ష అమలు అమానవీయం, హీనం అని ఆధునిక న్యాయశాస్త్రం గుర్తించింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం మరణశిక్ష అమలు అనేది ఎంతకాలం తరువాత జాప్యం కిందకి వస్తుందన్న దానిపై ఇంతవరకు స్థిరమైన మాట చెప్పలేదు.

మోహిందర్ సింగ్(1953) కేసులో ఒక సంవత్సరం జాప్యాన్ని హర దయాళ్(1976) కేసులో 21 నెలల జాప్యాన్ని మరణశిక్షని జీవిత ఖైదుగా మార్చటానికి కీలకంగా పరిగణనలోకి తీసుకున్నారు. కానీ బాలక్ రాం(1977) కేసులో ఆరు సంవత్సరాల జాప్యాన్ని కూడా తగినంత జాప్యంగా పరిగణించలేదు.

భగవాన్ బక్స్ సింగ్ (1978) కేసులో రెండున్నర సంవత్సరాల జాప్యం తగినంత జాప్యంగా పరిగణనలోకి తీసుకున్నారు. పశుపతి సింగ్(1973) కేసులో హైకోర్టు ముద్దాయిని నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ, నేరం జరిగిన రోజు నుండి లెక్కవేసి జాప్యం జరిగింది అన్న కారణంతో సుప్రీం కోర్టు మరణశిక్షని రద్దు చేసింది. ఒక మహిళని, ఆమె బిడ్డను హత్య చేసిన నేరానికి సంబంధించిన ఈడిగ అనమ్మ కేసులో ఉరికంబం  ఎక్కాల్సివస్తుందేమోనన్న మనోవ్యధతో రెండు సంవత్సరాలు జైలులో గడిపిందన్న కారణంతో మరణశిక్షను కోర్టు రద్దు చేసింది. టి.వి.వాథీశ్వరన్(1983) కేసులో సుప్రీం కోర్టులో విచారణకి వచ్చిన నాటికి ట్రయల్ కోర్టులో శిక్ష విధించిన దానికీ మధ్య రెండేళ్ల కన్నాఎక్కువ సమయాన్ని తగిన జాప్యంగా కోర్టు భావించింది.

“ఇదిగో ఇన్ని సంవత్సరాల తరువాత మరణశిక్ష అమలు అర్హత కోల్పుతుంది అనే అభిప్రాయంతో మేము ఏకిభవించం” అని పేర్కొంటూ కె.పి.మొహమ్మద్(1984) కేసులో రెండు సంవత్సరాల నియమంతో విభేదిస్తున్నట్లు కోర్టు పరోక్షంగా పేర్కొన్నది. టి.వి.వాథీశ్వరన్ తీర్పు వచ్చిన కొన్ని వారాలకి షేర్ సింగ్(1983) కేసులో రెండు సంవత్సరాల నియమం రూఢి చేయదగినది కాదంటూ కోర్టు దానిని కొట్టివేసింది. మునావర్ హరూన్ షా(1983) కేసులో ఐదు సంవత్సరాల జాప్యం ఉన్నా కూడా మరణశిక్షని రద్దు చెయ్యటానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. త్రివేణిబెన్(1988) కేసులో ‘నిర్ణీత సమయం ఒక నియమంగా పెట్టలేము, న్యాయ ప్రక్రియ పూర్తి అయిన తరువాత జరిగే జాప్యాన్నే పరిగణనలోకి తీసుకోవాలి’ అని  కోర్టు చెప్పింది.

ఎం.ఎన్ దాస్(2013) కేసులో శిక్ష పడి జామీనుపై బయట ఉన్న సమయంలో అతను మరొక హత్య చేశాడు. హతుని తల నరికి ఒక చేత్తో ఆ తలని, మరొక చేత్తో ఆయుధాన్ని పట్టుకుని పోలీసు స్టేషన్ కి వెళ్ళాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాస్ మరణశిక్షని జీవితఖైదుగా మార్చింది. కానీ అదే ధర్మాసనం అంతకు కొద్ది రోజుల క్రితమే దేవేందర్ పాల్ భుల్లార్ కేసులో మరనశిక్షని రద్దు చెయ్యటానికి నిరాకరించింది (ఆ తరువాత మరొక ధర్మాసనం ఆ మరణశిక్షని రద్దు చేసింది).

ఫైజన్ ముస్తఫా

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో 

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment