NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

భాజపా తురుపుముక్క తేజస్వి కి టీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం..! ఈ రేంజ్ వెల్ కమ్ ఊహించి ఉండడు…!

దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయం తర్వాత భారతీయ జనతా పార్టీ లో ఎక్కడ లేని దూకుడు పొంగుకొచ్చింది. కాంగ్రెస్ ను పక్కనపెట్టి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పోటీదారులు గా మారిన ఆ పార్టీ తన ఉనికిని చాటేందుకు తన సర్వశక్తులను ఒడ్డుతోంది. ఈ క్రమంలో వారు తీసుకున్న ఒక నిర్ణయం ఈ రోజంతా సోషల్ మీడియాను కుదిపేసింది.

 

ఒక పక్క చూస్తే కాంగ్రెస్ లో జోష్ కనబడడం లేదు. టిఆర్ఎస్ పార్టీ వారు ఎంతో అప్రమత్తంగా ఉన్నప్పటికీ లోపల ఉన్న ఆందోళన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో సంచలనాత్మకంగా జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఒక్ విప్లవాత్మక యువ నేతని రంగంలోకి దింపుతుంది భారతీయ జనతా పార్టీ. కర్ణాటకలో యువ నాయకుడు తేజస్వి సూర్య చాలా తక్కువ సమయంలోనే గొప్ప పేరు సంపాదించి జాతీయస్థాయిలో ఒక వెలుగు వెలిగి మోడీ దృష్టిలో పడిన విషయం తెలిసిందే. కాగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేయడానికి హైదరాబాద్ కు వెళ్లారు. ఇతని రాకతో పార్టీ నేతలు కార్యకర్తలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది కానీ చివరికి చూస్తే కథ అడ్డం తిరిగింది.

వివరాల్లోకి వెళితేమూడు పదుల వయసులోనే ఎంపీ అయిన తేజస్వి ఎంతో దూకుడుగా మాట్లాడి ప్రత్యర్థులను ఆత్మరక్షణ లోకి నెట్టడంలో సిద్ధహస్తుడు. ఇక హైదరాబాద్ లో అతడికి బిజెపి నాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఒక జాతీయ ప్రధాన నాయకుడి స్థాయిలో స్వాగతించింది బిజెపి క్యాడర్. అయితే అనూహ్యంగా ఎవరూ ఊహించని ఈ పరిణామం చోటు చేసుకుంది. వారితో పాటు టిఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు కూడా తేజస్వి కి స్వాగతం చెబుతున్నారు. అది మరోరకంగా అనుకోండి. సోషల్ మీడియాలో తేజస్వి ఆగమనాన్ని వాళ్లు మరో రకంగా ట్రెండ్ చేస్తున్నారు. అసలు అతను హైదరాబాద్కు ఎందుకు వస్తున్నాడు? వెళ్లిపొమ్మని చెప్పండి అంటూ బూతు మాటను హాష్ టాగ్ కు జోడించి పెడుతున్నారు.

ఇక్కడ ఇంకా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే…. ఈ హాష్ టాగ్ పైన కొన్ని వేల ట్వీట్లు పడుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఈ హాష్ టాగ్ ట్రెండ్ అవుతుండటం విశేషం. తేజస్వి సొంత నియోజకవర్గంలో ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యలను బయటికి తీసి సదరు వీడియోలను పోస్ట్ చేస్తూ చేస్తున్నారు. ముందు మన ఇల్లు సర్దుకొని తర్వాత పక్కన వాడి గురించి ఆలోచించాలని కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. ఈ రేంజ్ వెల్కమ్ తేజస్వి అస్సలు ఊహించి ఉండడు

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?