NewsOrbit
బిగ్ స్టోరీ

యల్లో ఎల్లెహే…!!

ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఏం జరిగినా వారి పాత్ర చాలా కీలకం..వారు లేకుండా వ్యవస్థలు ఏవీ నడవవన్నది వారి అభిమతం..!!

అలా కాకుండా ఏదైనా జరిగితే వారు మాత్రం ఊరుకోరు. బ్రహ్మాండం బద్ధలు చేస్తారు. సొంత మీడియాతో చెలరేగిపోతారు. ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో ఇప్పుడు యల్లో చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు.. జనం నవ్విపోదురగదా అని కూడా లేకుండా… బట్టలిప్పదీసి చూడలేనివన్నీ చూపించేస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలో చాలా మందికి ఎన్నో సంశయాలు… మరెన్నో అనుమానాలున్నాయ్. రాజధాని ఒక కులానికి సంబంధించినది కాదని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు. దాని గురించి తర్వాత వివరంగా చర్చించుకోవచ్చు. రాజధాని విషయంలో రైతులు చేయాల్సిన పని రైతులు చేస్తారు. తమ ఇబ్బందులను న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తారు.

 

ప్రభుత్వంపై పోరాటం చేస్తారు. కానీ ఇక్కడ ఒక అతేంద్రియ శక్తి… కంటికి కన్పించకుండా జనాల్ని వేధిస్తున్న వైరస్ తరహాలో మోహరించేసింది. అమరావతి ఈ రోజు దుస్థితికి మొదటి ముద్దాయి టీడీపీ. కానీ అక్కడి రైతులు, సంఘాలు ఆ మాట మాత్రం చెప్పవ్. మీడియా అసలే దాని గురించి మాట్లాడదు. ఎందుకంటే వాళ్లకు ఒక కన్నే… ఒక వర్షనే కన్పిస్తుంది. మీడియా నానా యాగీ చేస్తూ… రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియవన్నట్టుగా కట్టుకథలు ప్రచారం చేసేస్తున్నాయ్. కష్టాలు ఎవరికైనా ఒకేలా ఉంటాయ్. ఏ రైతైనా… కష్టాలు పడాలని కోరుకోరు. కానీ గ్రౌండ్ రియాల్టీని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా… ?

2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడాదంటూ పత్రికల్లో నిలువెత్తు ఆర్టికల్స్, ఎడిటోరియళ్లు వండివర్చింది యల్లో బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులైతేనేం… బీజేపీ-మోదీ యాంగిల్, పవన్ కల్యాణ్ రంగ ప్రవేశంతో… ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఐదేళ్లు చంద్రబాబునాయుడు అహో ఆంధ్రభోజా అంటూ అందినకాడికి మీడియా మేనేజ్మెంట్ తో వ్యవస్థలన్నింటినీ టీడీపీ బంధుగణం, యల్లో బ్రాండ్ ఆధీనంలోకి వెళ్లిపోయాయ్. పలానా వారికి కాంట్రాక్టులు, పలనా వారికి అడ్వైర్టైజ్మెంట్లు, పలనా వారికి పోస్టులు, పలానా వారికి కీలక బాధ్యతలు ఇలాంటివన్నీ కొన్ని వ్యవస్థల చేతిలోకి వెళ్లిపోయాయ్. పాలన ఎవరికి నచ్చినట్టు వారు… ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు.

అమరావతి రాజధాని గురించి ఇంత యాగీ చేస్తున్న చంద్రబాబు, యల్లో బ్రాండ్… రాజధాని విషయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని అసలు పరిగణలోకి తీసుకున్నారా… అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షనేతగా గుర్తించారా… అధికారం చేతిలో ఉంటే అంత విచ్చలవిడిగా చెలరేగిపోతారా… ఇదేం చోద్యం.. ఇంతలా బరితెగించి… ఇప్పుడు అనవసర మాటలు మాట్లాడతారా… ప్రతిపక్షనేతకు ఇవ్వాల్సిన గౌరవం రాష్ట్రంలో చాలా పెద్ద పత్రికగా చెప్పుకునే పత్రిక ఏరోజైనా చేసిందా… జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో పాదయాత్ర చేస్తే పసుపు నీళ్లతో కడుగుతారా… రాజధాని ప్రాంతంలో మీకు అంత హోల్డ్ ఉన్నప్పుడు తనయుడ్నే చంద్రబాబు గెలుచుకోలేకపోయారంటే… ఆ పాపం యల్లో బ్రాండ్‎దే కదా…
రాష్ట్రంలో ఓ దరిద్రపు పరిస్థితి. యల్లో గ్రూప్ చెప్పేదేంటంటే… కిందపడినా… తమదై పైచేయి అంటూ జబ్బలు చరుచుకుంటాయ్.

ఇక వారం వారం చెప్పే చెత్త పలుకులో మాయదారి మాటలు వింటుంటే వాక్ అన్పిస్తుంది. క్లియర్ గా ఒక్క విషయం చెప్పాలి. మీడియా పోషించాల్సిన పాత్ర అసలు పోషిస్తుందా… మీడియాకేమైనా కొమ్ములున్నాయా… మీడియా ఏమైనా కార్యనిర్వాహక వ్యవస్థా… శాసన వ్యవస్థా… మీడియా ఏమైనా ప్రజలకు జవాబుదారీ సంస్థా…. మీడియా ఏమైనా ప్రజల కోసం పనిచేస్తోందా.. మీడియా పెద్దలు చేస్తున్న అరచాకాలపై సవివరమైన దర్యాప్తు చేయడం ఎంతో అవసరం… బొచ్చు వస్తుందంటూ వందల కోట్లు దోచుకున్న ఐదు చానెల్ బండారం బట్టబయలు చేయాలి. పెట్టుబడుల గుట్టు విప్పాలి. ఎలాంటి నిబంధనలకు లేకుండా వందల, వేల కోట్ల రూపాయల ప్రకటనలను ఒకటి, రెండు సంస్థలకే కట్టబెట్టిన తీరుపైనా సీఐడీ విచారణ సాగించాలి. తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో పనిచేసే జర్నలిస్టులు కేవలం కొరియర్లు మాత్రమే… అక్కడ ఏజెండా అంతా మేనేజ్మెంట్ల కనుసన్నల్లోనే జరిగిపోతోంది.

 

author avatar
Special Bureau

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju