NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వైకాపా vs టీడీపీ : విగ్రహాల రాజకీయం !

స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు చలనచిత్ర మహానటుడు ఎన్టీఆర్ వెండి తెరపై ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లో సైతం ఎదురులేకుండా రానించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు. ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఎలాంటి స్థానం సంపాదించారో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ…. ప్రతి పట్టణంలో నిలబెట్టిన ఆయన నిలువెత్తు విగ్రహాలే చెబుతాయి. అశేష ఆంధ్రావని ఆయనను కీర్తిస్తారు, గౌరవిస్తారు, మరి విగ్రహాలకు పూలమాలలు వేస్తారు. అయితే ఇప్పుడు ఏపీ లో అక్కడా రాజకీయం మొత్తం ఈ విగ్రహం చుట్టూనే జరుగుతోంది.

 

NTR statue removal sparks row in Kavali

 

పోలీసుల సాక్షిగా కూల్చివేశారు

నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ లోని ముసునూరు లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పోలీసుల సాక్షిగా వైసిపి నాయకులు పెకలించివేశారు. విగ్రహం చుట్టూ ఉన్న రక్షణ కూడా ధ్వంసం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడి హస్తం ఇందుకో ఉందని మరియు కేవలం కుట్రపూరితంగా తమ నాయకుడి విగ్రహం తొలగించారని తెలుగు తమ్ముళ్లు ధ్వజమెత్తారు. ఇకపోతే వైసిపి నాయకులు మాత్రం గుడి కి అడ్డుగా ఉన్న దాన్ని తొలగించవలసి వచ్చిందని మరో చోట దీనిని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని…. ఈ విషయాన్ని ముందే చెబితే తెదేపా వారు ఒప్పుకోలేదని అన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తాము దానిని తొలగించి విగ్రహాన్ని అప్పగించినట్లు కూడా చెప్పుకొచ్చారు.

ఇది ఛాలెంజ్ ల సమయం….

ఇక ఈ వివరణ విన్న తర్వాత ఈ విషయంపై స్పందించిన నెల్లూరు టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నందమూరి తారకరామారావు గారి విగ్రహం మళ్లీ ఇక్కడ పెట్టి తీరుతామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కి చాలెంజ్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయమై విచారణ చేయమని…. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు అంతా ముసునూరి కి వస్తారు అని చెప్పుకొచ్చినట్లు తెలిపారు.

ఇంకేముంది అక్కడ యుద్ధం మొదలైపోయింది

ఇక ఈ తతంగం మొత్తం తెలిసిన టిడిపి అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు విషయం తెలిసిన వెంటనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విగ్రహం తొలగింపుకి గల కారణాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. ఈ లోపల సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై ఫైర్ అవుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ విగ్రహం తొలగించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. ఇక నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా లేరు. ఇంకా ఈ విగ్రహం తొలగింపు వివాదం ఎంత వరకు వెళుతుందో…. రాష్ట్రంలో ఇలా విగ్రహ రాజకీయాలు ఎన్ని చోట్ల మొదలవుతాయో వేచి చూడాలి.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !