33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Chiranjeevi: చిరంజీవి సినిమా షూటింగ్ సెట్ లో ప్రమాదం..!!

Share

Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి చాలా వేగంగా సినిమాలు చేస్తున్నారు. పాండమిక్ తర్వాత చిరంజీవి మాదిరిగా సినిమాలు చేస్తున్న మరో హీరో లేరు. గత ఏడాది “ఆచార్య”, “గాడ్ ఫాదర్” సినిమాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోనే “వాల్తేరు వీరయ్య” సినిమాతో ప్రేక్షకులను పలకరించడం జరిగింది. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో “బోలా శంకర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ తో చిరంజీవి నటించిన ఆచార్య అట్టర్ ఫ్లాప్ కావటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అసలు ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొరటాల మార్క్ సినిమాలో ఎక్కడా కనిపించలేదు.

Accident on the shooting set of Chiranjeevi's movie

అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకున్న సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 20 ఎకరాల్లో ఉన్న ఈ సెట్ మొత్తం అంత కాలి బూడిదయింది. అప్పట్లో ఈ సినిమా కోసం ధర్మస్థలిని రూపొందించడం జరిగింది. హైదరాబాద్ శివారులో కోకాపేట వద్ద ఈ సెట్ వేశారు. షూటింగ్ మెజార్టీ టాకీ పార్ట్ ఈ సెట్ లోనే జరిగింది. అయితే షూటింగ్ కంప్లీట్ అయ్యి థియేటర్ లో రిలీజ్ అయ్యి… కొన్ని నెలలు అయిపోయినా గాని ఆ సెట్ అలానే ఉంచేశారు. అయితే ఇప్పుడు అక్కడే భార్య మంటలు చల్లారేగటంతో అగ్నికులలో దట్టంగా వ్యాపించటంతో… 20 ఎకరాల్లో ఉన్న సెట్ మొత్తం అంత కాలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Accident on the shooting set of Chiranjeevi's movie

దాదాపు 23 కోట్ల రూపాయల ఖర్చు చేసి ధర్మస్థలి పేరుతో.. ఈ దేవాలయపు సెట్ నిర్మించారు. కాగా సోమవారం సాయంత్రం 6:00 టైంలో దట్టమైన అగ్నికీలలు కనిపించడంతో సమీపంలో ప్రజలు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్లు వచ్చేసరికి దాదాపు సగానికి పైగానే కాలిపోవడం జరిగింది. ఈ క్రమంలో మంటలు అదుపు చేయాలని ప్రయత్నాలు చేసిన ఎక్కడా కుదరలేదు. అయితే అదృష్టం కొద్దీ ఎక్కడా కూడా ప్రాణా నష్టం జరగలేదు. ఈ భారీ టెంపుల్ సెట్ నీ ఆర్ట్ డైరెక్టర్ సురేష్… డిజైన్ చేయడం జరిగింది. మరి ఇటువంటి సెట్ లో మంటలు ఎలా చెలరేగాయి..? నిప్పు ఎక్కడ నుంచి వచ్చిందనేది తెలియాల్సి ఉంది.


Share

Related posts

వర్మ స్పీడుకు కేంద్రం బ్రేకులు..! ఇదే నిదర్శనం..

Muraliak

బేబీ బంప్‌తో తొలిసారి ద‌ర్శ‌న‌మిచ్చిన అలియా భ‌ట్‌.. వీడియో వైర‌ల్!

kavya N

Anu Emmanuel : పాపం ఈ హాట్ హీరోయిన్.. రెమ్యునరేషన్ ఇవ్వకుండా నిర్మాత దారుణంగా?

Teja