Anil Ravipudi: టాలీవుడ్లో అపజయమే ఎరుగని అతి కొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయన.. `పటాస్` వంటి హిట్ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కించిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు వరసగా సక్సెస్ అయ్యాయి.
ఇక ఇప్పుడు ఈయన `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా `ఎఫ్ 3`ని రూపొందించారు. ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.. వారి సరసన తమన్నా, మెహ్రీన్‌లు చేశారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై భారీ బజ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ పాత్ర ఎలా ఉంటుందనే ప్రశ్న ఎదురైంది.
అందుకు ఆయన బదులిస్తూ.. `ఆ ఒక్కటి అడగొద్దు.. అది సస్పెన్స్. సోనాల్ పాత్ర ఏమిటి? ఆమె ఏం చేస్తుందనేది తెరపై చూడాల్సిందే. ఇప్పుడే చెప్పేస్తే ఆ కిక్కు పోతుంది` అంటూ సమాధానం ఇచ్చారు. ఎఫ్ 3 ట్రైలర్ లో కూడా సోనాల్ పాత్ర గురించి ఎలాంటి డిటెయిల్ ఇవ్వలేదు. దీంతో సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. మరి ఈ సస్పెన్స్ ఏంటో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.