Brahmanandam: బ్రహ్మానందం తనయుడు గౌతమ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ఎక్సపెరిమెంట్స్ చేస్తున్నాడు. కానీ, ఇప్పటి వరకు సరైన గుర్తింపు రాలేదు. అయితే విభిన్నమైన కథలు ట్రై చేస్తాడనే పేరు మాత్రం గౌతమ్ కి వుంది. మొదటి సినిమా ‘పల్లకిలో పెళ్లికూతురు’ తర్వాత.. బసంతి, మను లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన హీరోగా రూపొందతున్న సినిమా గ్లిమ్స్ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
Brahmanandam: మీమ్స్‌పై క్రేజీగా ఫీల్ అవుతున్న బ్రహ్మానందం.. షాక్ లో ఆలీ?
Brahmanandam: గౌతమ్ లుక్ ఇదే..
యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుంచి ప్రోడక్షన్ నెం.10గా నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లుక్ విషయానికొస్తే, బ్లాంక్ స్క్రీన్‌పై వాయిస్ ఓవర్ పోస్ట్ అవుతుంది. “ఒంటరి తనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా?” అనే డైలాగ్‌తో గౌతమ్ ఇంటెన్సివ్ లుక్ రిలీవ్ అవుతుంది. లుక్స్ పరంగా రచయిత క్యారెక్టర్ని ఫరెఫెక్ట్గా మ్యాచ్ చేసే విధంగా ఉన్నాయి. ఆర్టిస్ట్‌గా మనుతో సర్ప్రైజ్ చేసిన గౌతమ్ ఈ సారి మరో కొత్త ఎక్స్ పీరియన్స్ ప్రేక్షకులకు అందించబోతున్నాడు.
Brahmanandam: పాన్ ఇండియా సినిమా ఛాన్స్ అందుకున్న బ్రహ్మానందం..!!
మోనోఫోబియా రచయిత!
ఈ సినిమాలో గౌతమ్ మోనోఫోబియాతో బాధ పడుతున్న ఓ పెయిన్ ఫుల్ రచయితగా కనిపిస్తున్నాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది? తను బాధపడుతున్న సమస్యకు మరో పెద్ద సమస్య తోడైతే అతను ఎలా అధిగమించాడు అనేది ఈ సినిమా. ఇది ఫుల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ సినిమా అని చిత్ర యూనిట్ చెబుతుంది. S ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిషెడ్యూల్ జరుపుకుంటుంది. MS జోన్స్ రూపెర్ట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సృజన్ యరబోలు నిర్మాత, దర్శకత్వం సుబ్బు చెరుకూరి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!