Devatha Serial: దేవత సీరియల్ అనుబంధాలకు నిలయం.. అనురాగాలు, ఆప్యాయతలను సరికొత్త కోణంలో చూపిస్తూ వీక్షకులను టీవీల నుంచి కదలనివ్వకుండా చేస్తుంది.. సరికొత్త కథనంతో ఊహించని మలుపులతో సాగుతూ.. అనూహ్యమైన స్పందనను సొంతం చేసుకుంటుంది దేవత సీరియల్..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Devatha Serial: 523 ఎపిసోడ్ హైలెట్స్..
రాధా దేవి దత్తత విషయంలో అందరికు సమాధానం చెబుతుంది.. ఎవరికి తగ్గ రీతిలో వారికి తగ్గట్టుగా సమాధానం చెబుతుంది. ఇక నిన్న దేవిని దత్తత విషయంలో మాధవ తో మాట్లాడుతుండగా అనుకోకుండా దేవి అక్కడికి వస్తుంది. తన నిర్ణయం మార్చుకోనని రాధా అంటున్న మాటలు దేవి వింటుంది. ఇన్ని రోజులు నుంచి నువ్వు ఆఫీసర్ సార్ వాళ్ళ ఇంటికి నన్ను పొమ్మంటే సరదాగా అంటున్నావు అనుకుంటున్నాను.. నిజంగా నన్ను పంపిస్తావని అనుకోవడం లేదు.. నన్ను ఆఫీసర్ ఇంటికి పంపించి నువ్వు సంతోషంగా ఉండగలవా అని దేవి అడుగుతుంది.. దేవికి రాధ సమాధానం చెప్పే లోపే నిన్నటి ఎపిసోడ్ ముగుస్తుంది దాంతో రేపటి వరకు ఉత్కంఠతను కొనసాగించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దేవి తో రాధ నువ్వు లేకుండా ఉండగలను అని చెబుతుంది. ఆఫీసర్ సార్ వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరు. వాళ్ళ ఇంటికి వెళితే నువ్వు వాళ్ళ ఇంట్లో అందరికీ ఆనందాన్ని పంచడంతో పాటు నీ జీవితం కూడా బాగుపడుతుంది. నిన్ను మంచిగా చదువిపిస్తారు అని చెబుతుంది. రాధా ఉంటాను అని అనడంతో దేవి మనసు ముక్కలవుతుంది. ఇక దేవి కూడా ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. ఆ విషయం తెలిసిన ఆదిత్య ఆనందంలో మునిగిపోతాడు.