NewsOrbit
సినిమా

Karthika Deepam: హిమ ప్రవర్తన చూసి విసిగిపోయిన నిరూపమ్.. శోభకు దగ్గర కానున్నాడా..!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.హిమ, సౌర్య, నిరుపమ్‌ల జీవితాల్లోకి శోభ ఎంట్రీ ఇవ్వడంతో కథనం మరింత ఉత్కంఠగా మారింది.గత ఎపిసోడ్ లో హిమ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒకే చెబుతుంది. మరోపక్క ప్రేమ్ భోజనం తెచ్చిన జ్వాల మీద సీరియస్ అవుతాడు ఇక ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్ హిమ జ్ఞాపకాలతో బాధ పడుతూ ఉంటే ఆ సమయంలోనే హిమ..

karthika deepam latest episode
karthika deepam latest episode

నిరూపమ్ కు షాక్ ఇచ్చిన హిమ :

నిరుపమ్ క్యాబిన్‌లోకి వస్తుంది. ‘రావడంతోనే బావ అని పిలవకుండా డాక్టర్ నిరుపమ్ అంటుంది.నిరూపమ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ‘ఏం అయ్యింది హిమా నీకు? బావా అనే పిలుపుని కూడా మరిచిపోయావా? ఏంటి.ఒక్క రోజులో పుస్తకాన్ని మూసినట్లుగా బంధాలు, జ్ఞాపకాలు, పిలుపులు అన్నీ ఎలా మూసేస్తారు?ఇది మీ ఆడవారికే సాధ్యమేమో కదా? అంటాడు. నువ్వు బావా అని కాకుండా డాక్టర్ నిరుపమ్ అంటే ఒక త్రిశూలం తెచ్చి గుండెల్లో గుచ్చినంత బాధగా ఉంది హిమా అంటూ చాలా బాధపడుతూ చెప్తాడు. ఇక హిమ మాత్రం నేను నీకు కరెక్ట్ కాదు అనుకుంటున్నాను’ అంటుంది ‘నువ్వు అనుకుంటే సరిపోదుగా నేను అనుకోవాలిగా? అసలు అలా ఎందుకు అనుకుంటున్నావ్..తెలుసుకోవచ్చా డాక్టర్ హిమా గారు?’ అంటాడు నిరుపమ్.‘నేను నీకు ఒక అమ్మాయిని చూపిస్తాను. ఆమెను పెళ్లి చేసుకో’ అంటుంది హిమ. ఏయ్ ఏం అయ్యింది నీకు? నువ్వు అమ్మాయిని చూపిస్తే నేను పెళ్లి చేసుకోవడం ఏంటీ.?అంటాడు ప్లీజ్ హిమా నిజం చెప్పు..’ అంటూ రిక్వస్ట్ చేస్తాడు.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమ మీద కోపంతో శోభకు దగ్గర అవ్వనున్న నిరూపమ్ :

ఇంతలో నిరూపమ్ క్యాబిన్ లోకి శోభా వచ్చి.. ‘సారీ సారీ’ అని వెనక్కి వెళ్లిపోబోతుంది. ‘ఆగు శోభా ఇక్కడ అంతగా ఏం జరగట్లేదులే పదా వెళ్దాం’ అంటూ శోభాతో పాటుగా బయటికి వెళ్లిపోతాడు నిరుపమ్.వెంటనే హిమ టెన్షన్‌గా.. ‘ఛా ఇప్పుడు బావ నా మీద కోపంతో ఆ శోభకు దగ్గరవుతాడా ఏంటి..సౌర్యని రమ్మని చెప్పాను ఇంకా రాలేదేంటీ?’ అని మనసులోనే టెన్షన్ పడుతుంది హిమ.

karthika deepam latest episode
karthika deepam latest episode

జ్వాల ఇంటికి వెళ్లిన సౌందర్య:

సీన్ కట్ చేస్తే జ్వాల సౌందర్యని ఇంటికి తీసుకుని వెళ్తుంది. కుడికాలు లోపల పెట్టి రా సీసీ అంటూ చాలా ప్రేమగా సౌందర్యని తన ఇంటికి ఆహ్వానిస్తుంది.ఇంట్లో ఎవరు లేరా అంటే పిన్నీ బాబాయ్‌లు ఉంటారు.. కానీ బయటికి వెళ్లారు అంటూ టీ తీసుకొచ్చి సౌందర్యకు అందిస్తుంది. ఇంతలో హిమ కాల్ చేసి.. ‘రమ్మన్నా కదా రాలేదే?’ అంటుంది. చుట్టాలు వచ్చారులే నేను మళ్లీ కాల్ చేస్తా అని చెప్పి జ్వాల ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత సౌందర్య జ్వాల చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ‘ఏం లేదు రౌడీ పిల్లా.. నీ వయసుతో పాటుగా ఉండే నాకు ఒక మనవరాలు ఉంది. తనకి నిశ్చితార్థం చెయ్యాలని చూశాను అంటుంది సౌందర్య.

హిమ ఎంగేజ్మెంట్ గురించి తెలుసుకున్న జ్వాల :

ఇక జ్వాల మాత్రం అంటే నా శత్రువు నిశ్చితార్థం కూడా చేసుకుందా?’ అని రగిలిపోతుంది మనసులో..ఇక వెంటనే నవ్వుతూ మరీ పార్టీ ఇది సీసీ అంటుంది.పార్టీ దాకా రాలేదే… నిశ్చితార్థం మధ్యలోనే ఆగిపోయింది. ఏమైందో ఏమో తెలియదు గాని ఈ పెళ్లి ఇష్టంలేదని క్యాన్సిల్ చేసింది అని అంటుంది.అసలు దాని మనసులో ఏముందో నువ్వు తెలుసుకుని పెళ్లికి ఒప్పిస్తావా?’ అంటుంది సౌందర్య జ్వాలతో. ‘నేనా? నా వల్ల కాదు సీసీ ఇవన్నీ అయినా నా శత్రువు పెళ్లి నేను దగ్గరుండి చెయ్యాలా’ అని రగిలిపోతుంది మనసులో. ‘సీసీ ప్లీజ్.. ఆ విషయాన్ని ఇక్కడితో వదిలెయ్.. కూర్చో వస్తాను’ అంటూ అక్కడ నుంచి కిచెన్‌లోకి వెళ్తుంది జ్వాల.

మళ్ళీ స్వప్నను బురిడీ కొట్టించిన ఇంద్రుడు, చంద్రుడు దంపతులు :

సీన్ కట్ చేస్తే స్వప్న షాపింగ్ చేసి కారులో వెళ్లేందుకు కారు దగ్గరకు వస్తుంది. అప్పుడే చంద్రమ్మ, ఇంద్రుడు కనిపిస్తారు. ఆమ్మో వీళ్ళు కనిపించారేంటి ‘ఇప్పుడు నా కారు బాగానే ఉంది కదా.. వీళ్లు నా దగ్గర డబ్బులు లాగడానికే.. టైర్ పోయిందని, తాళం పోయిందని నాటకాలు ఆడారా?’ అనే అనుమానం వస్తుంది. ఒక టెస్ట్ పెడదాం అని చెప్పి అటుగా వస్తున్న ఇంద్రుడు వాళ్లని ఆపి నాకు కారు చెడిపోయింది చూడండి అని అబద్దం చెబుతుంది.అయితే ఇంద్రుడు మొత్తం చెక్ చేసి ‘కారుకి ఏ ప్రాబ్లమ్ లేదు మేడమ్ అంతా బాగుంది. మీకు మా మీద అనుమానం వచ్చింది కదా? మాకు మనోభావాలు ఉన్నాయి మేడమ్ అనీ తిరిగి కౌంటర్ వేసి అక్కడ నుంచి భార్యని తీసుకుని వెళ్లిపోతాడు.కానీ చంద్రమ్మ మాత్రం ఎందుకు గండా అలా చేశావ్.. చక్కగా మరో పదివేలు కొట్టేసేవాళ్లం కదా? అంటుంది.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri