న్యూస్ సినిమా

KGF 2: పెళ్ళి కార్డుపై యష్ డైలాగ్..ఇలాంటి అభిమానులు కూడా ఉంటారా..?

Share

KGF 2: ఇప్పుడు ఎక్కడ చూసిన కన్నడ రాకింగ్ స్టార్ మేనియానే కనిపిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ ఛాప్టర్ 2తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యష్. ప్రశాంత్ నీల్  దర్శకత్వం లో వచ్చిన ఈ సాలీడ్ యాక్షన్ సీక్వెల్ భారీ హిట్ సాధించింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు రూ 500 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టిందని ప్రచారం జరుగుతోంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలలోని అన్నీ భాషలలో కేజీఎఫ్ 2 భారీ హిట్ సాధించి వసూళ్ళ సునామీని సృష్ఠిస్తోంది.

kgf-2 yash dialogue on wedding card
kgf-2 yash dialogue on wedding card

కేవలం సౌత్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఊహించని స్థాయిలో వసూళ్ళను రాబడుతోంది. అక్కడ హీరోలను, దర్శక – నిర్మాతలను ఈ సినిమా ఆశ్చర్యపరుస్తోంది. ఆ రేంజ్‌లో సత్తా చాటుతోంది. ఇటీవల సౌత్ నుంచి వచ్చిన రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 ఇంత పెద్ద సక్సెస్ సాధించి పాన్ ఇండియన్ రేంజ్ హిట్ కొట్టడంతో బాలీవుడ్ మేకర్స్ మన సౌత్ సినిమాల గురించి..ఇక్కడి మేకర్స్ గురించి హాట్ టాపిక్‌గా మాట్లాడుకుంటున్నారు.

KGF 2: యష్ మేనియా ఫ్యాన్స్‌లో ఇంతగా ఉందా అని మాట్లాడుకుంటున్నారు.

అయితే, మనది ఫ్యాన్స్ బేస్డ్ ఇండస్ట్రీ అని మరోసారి ప్రూవ్ అయింది. కన్నడ రాకింగ్ స్టార్ మేనియా ఎంతగా ఉందో ఒక అభిమాని తన వెడ్డింగ్ కార్డు ద్వారా చూపించాడు. కేజీఎఫ్ 2 సినిమాలో వైలెన్స్ .. వైలెన్స్ ..వైలెన్స్ అనే డైలాగ్ ఉంది. అదే మాదిరిగా మ్యారేజ్..మ్యారేజ్..ఐ డోంట్ లైక్ మ్యారేజ్..బట్ అంటూ కేజీఎఫ్ సినిమా డైలాగ్‌ను ముద్రించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. దాంతో యష్ మేనియా ఫ్యాన్స్‌లో ఇంతగా ఉందా అని మాట్లాడుకుంటున్నారు.


Share

Related posts

ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు..! ఎందుకంటే..?

somaraju sharma

రామ‌తీర్థం ఘ‌ట‌న‌ దోషులు దొరికిపోయారా?

sridhar

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar