29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రంగంలోకి దిగుతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్..?

Share

NTR 30: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ రెండో సినిమా చేయనన్న సంగతి తెలిసిందే. “NTR 30” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు ఈనెల 23వ తారీకు ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఫిబ్రవరి 24వ తారీఖు ఈ సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేయగా నందమూరి తారకరత్న మరణించడంతో వాయిదా పడింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ టైం ఎన్టీఆర్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి జాన్వి కపూర్ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అభిమానులకు కొరటాల శివ బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

Megastar Chiranjeevi is entering the field for NTR's 30th film Big surprise for fans

పూర్తి విషయంలోకి వెళ్తే “NTR 30″లో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను తీసుకోవడానికి కొరటాల డిసైడ్ అయినట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి సైఫ్ అలీ ఖాన్ కూడా రాబోతున్నట్లు సమాచారం. నందమూరి అభిమానులకు మరింత పెద్ద సర్ప్రైజ్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా తీసుకురావడానికి కొరటాల డిసైడ్ అయ్యారట.

Megastar Chiranjeevi is entering the field for NTR's 30th film Big surprise for fans

కొరటాలతో విభేదాలు ఉన్నట్లు మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని చిరంజీవి డిసైడ్ అయ్యి .. రాబోతున్నారట. పైగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఫస్ట్ టైం సౌత్ లో ఎంట్రీ ఇస్తూ ఉండటంతో… చిరు రావడానికి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో.. ఒక చిరంజీవి మాత్రమే కాదు రామ్ చరణ్ కూడా రానున్నట్లు ప్రచారం జరుగుతుంది.


Share

Related posts

Anu Sithara Beautiful Pics

Gallery Desk

Mouni Roy Latest Stills

Gallery Desk

సోగ్గాడు శోభన్ బాబు కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతారు

Varun G