Prabhas: బాహుబలి సినిమాకు ఓవర్సీస్లో అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బాహుబలి ది బిగినింగ్ కన్నా.. బాహుబలి ది కంక్లూజన్‌కు అదిరిపోయే రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ తర్వాత సాహోకు మంచి బేరాలే వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన రాధేశ్యామ్ మాత్రం ఓవర్సీస్ బిజినెస్ విషయంలో ఎందుకో ఫెయిల్ అయ్యింది. రాధేశ్యామ్ సినిమాను కొనేందుకు ఓవర్సీస్ బయ్యర్లు ఆసక్తి చూపలేదు.
అనుకున్న రేంజ్లో బేరాలు రాలేదు. అయితే యూవీ క్రియేషన్స్ గ్రేట్ ఇండియా ఫిలింస్ ద్వారా సొంతంగా విడుదల చేసుకుంది. అయితే ప్రభాస్ నటిస్తోన్న మూడు సినిమాల్లో రెండు సినిమాలకు మాత్రం ఓవర్సీస్ నుంచి అదిరిపో యే రేట్లు వస్తున్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ విషయంలో బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న సలార్, వైజయంతీ మూవీస్ – నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే విషయంలో మాత్రం మంచి బేరాలు సాగుతున్నాయని తెలుస్తోంది. సలార్ ను రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సలార్ ఫస్ట్ పార్ట్‌కే ఓవర్సీస్లో రు. 50 కోట్లు నిర్మాతలు కోట్ చేస్తున్నారు. అయినా కొనేందుకు బయ్యర్లు ముందుకు వస్తున్నారట. కేజీఎఫ్ 2 రిలీజ్ అయిన వెంటనే ఈ డీల్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు.
ఇక ప్రాజెక్ట్ కే విషయంలో 70 కోట్లు నిర్మాతలు కోట్ చేస్తున్నారు. దానికి కూడా బేరాలు మొదలయ్యాయి. రు. 70 కోట్లకు కాస్త అటూ ఇటూగా ఈ డీల్ కూడా క్లోజ్ అవుతుందని అంటున్నారు. విచిత్రం ఏంటంటే రాధేశ్యామ్ కు 20 కోట్ల మేరకు ఓవర్ సీస్ లో మార్కెట్ జరగలేదు. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు రు. 50, రు. 70 కోట్ల రేంజ్లో ఓవర్సీస్లో మార్కెట్ జరుగుతుండడంతో ట్రేడ్ వర్గాలు, ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఏదేమైనా రాధేశ్యామ్‌కు నెగిటివ్ టాక్ ఉన్నా.. ప్రభాస్ డిమాండ్ అయితే తగ్గలేదు.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!