Mahesh Babu: సర్కారు వారి పాట సక్సెస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆర్.ఆర్.ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ తో దర్శక ధీరుడు రాజమౌళి ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీలో యాక్ట్ చేస్తుండగా.. ఈ సినిమా పూర్తవ్వగానే రాజమౌళి సినిమా స్టార్ట్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ఆ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత విదేశాలకు వెళ్ళి బాగా రిలాక్స్ అయి వచ్చిన జక్కన్న వచ్చీ రాగానే మహేశ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో చర్చలకు దిగారు. ఇద్దరూ కలిసి మహేశ్ సినిమా కథపై చర్చలు జరుపుతున్నారు.
అయితే ఈ మూవీ 2023 ఆరంభంలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుండగా.. ఇందులో హీరోయిన్‌ను అయితే ఇంకా ఎంపిక చేయలేదు. కానీ సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను మహేష్ కు జోడీగా ఎంపిక చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్‌లో ప్రభాస్ సరసన ‘సాహో’ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన యాక్టింగ్‌తో, అందచందాలతో తెలుగు ఆడియన్స్‌ను అలరించింది. అయితే ఈ విషయంపై మహేష్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ఆమె సాహోలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. కనుక ఆమె హీరోయిన్‌గా వద్దే వద్దు.. అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారట. అయితే ఫ్యాన్స్ విజ్ఞప్తిని జక్కన్న పరిగణనలోకి తీసుకుంటారా.. లేదా.. అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరున్న శ్రద్ధాకపూర్‌కు మహేష్ బాబు-రాజమౌళి మూవీలో అవకాశం దొరికితే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లేనని సినీ ప్రియులు అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ మూవీలో బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్‌కు ఛాన్స్ ఇచ్చిన జక్కన్న.. ఈసారి శ్రద్ధాకపూర్‌కు అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు…
టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఓ రేంజ్లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…
లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు…
టాప్ 10 తెలుగు ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…
పోయిన శుక్రవారం భారీ అంచనాల నడుమ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటే `బింబిసార`. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…
విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…