అసలు మెగాపవర్ రామ్‌చరణ్ కోర్టు మెట్లెక్కిందెందుకు? ఆయన నటిస్తోన్న `ఆర్ఆర్ఆర్` సినిమా కోసం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజుని కోర్టులో హాజరు పరిచే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌చరణ్ తాను షూటింగ్లో పాల్గొంటున్న విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేశారు. “ఉదయాన్నే రామోజీ ఫిలిమ్ సిటీకి రావడం ఆనందంగా ఉంది. భలేగా ఉంటుంది. షూటింగ్‌ను ఆస్వాదిస్తున్నాను“ అని రామ్‌చరణ్ తెలిపారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!