NewsOrbit
వ్యాఖ్య

ఆటవిక దశకా పయనం!?

నాకు పేపర్ చూడాలంటే భయం వేస్తోంది
ఈవిడకి ఏవైనా వెర్రి ఉందా  చెప్పిందే చెప్తుంది అంటారని  తెలుసు
కానీ ఇది వింటే  మీకూ  తెలుస్తుంది
నిర్భయ కేసుకి ఇప్పుడు ఏడేళ్లు
అప్పుడు దేశం భయంతో వణికింది
ఎన్నో చట్టాలు వచ్చేయి
గమ్మత్తు ఇప్పటికి ఆడవాళ్ళకి ఎనభై శాతం భద్రత లేదు
ఇది ఒక సర్వే నివేదిక
ఈ సర్వేలు నివేదికలు ఇంక్విరీలు ఇవన్నీ కాగితాలమీదే ఉంటాయి
మరింక నాలాటివాళ్ళు యెంత అరిచి ఏవి లాభం
అసలు నేను ఇలాంటివి రాయకూడదనుకున్నాను
కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఆఫీసులోనే పెట్రోలుపోసి తగలేశారు అని చదివేక గుండె మండిపోయింది
మరీ  ఇంత దారుణవా  వాడూ  కాలిపోయేడు
కాపాడబోయిన డ్రైవర్ కాలిపోయేడు
ముగ్గురు బలి అయ్యేరు
ఎంతమంది యెంత సంతాపం చెప్పినా యెంత పరిహారం ఇచ్చినా  ఆపిల్లలకి తల్లిని తెగలరా
బహుశా అతనికి మరో భార్య వస్తుంది
ఆ పిల్లలకి తల్లి రాదు అనాధలుగా మిగిలిపోతారు
కారణం భూమి తగాదా కావచ్చు మరేదయినా కావచ్చు
మనిషిని తగలపెట్టడం వల్ల సమస్య తీరదు
నాకు అప్పుడప్పుడు ఇవన్నీ చదివేక అనిపిస్తుంది
ఆడవాళ్లు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటేనే బావుంటుంది అని
అంతగా కావాలంటే ఇంట్లోనే ఉండి  సంపాదించుకోవచ్చు
చదవడం తప్పుకాదు తప్పకుండా చదవండి
దాన్ని ఇంటికే వాడుకోండి
ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయి ట్యూషన్లు చెప్పవచ్చు ఏ చదువు లేనివాళ్లు ఏదో ఒకటి చేసి ఆర్జిస్తున్నారు
చదుకున్న మీరు చెయ్యగలరు
ఈ వేధింపులు ఉండవు
పిల్లల సంగతి అడగొద్దు
ఓ కుర్రాడు  తల్లి ఫోన్ కొనలేదని ఉరివేసుకున్నాడు వాడి వయసు పదేళ్లు
మరొకడు తండ్రి టీవీ రిమోట్ ఇవ్వలేదని అతన్ని చంపేసేడు
అంటే వాళ్ళకి ఫోన్ టీవీ ప్రాణం కంటే ఎక్కువ
నేను రాస్తున్నవి రిపోర్టులు కావు జరిగిననిజాలు
ప్రతిరోజూ డైలీ సీరియల్ లాగా జరుగుతున్నాయి వీటికి అంతు  లేదా
ఆంథ్రోపాలజీ ప్రకారం మానవజాతి కోతి నుంచి  పరిణామం చెందడానికి
కొన్నివేల ఏళ్ళు పట్టింది
మనిషి దానవుడుగా మారడానికి టైము పట్టలేదు
అతి తక్కువ కాలంలో మారిపోతున్నాడు
మనిషిలో దానవుడు ఉంటున్నాడు
లేకపోతె మనం ఆదిమానవుడి దశకి వెళ్ళిపోతున్నావా
అప్పుడు ఏ బంధాలూ లేవు
ఇది పరిణామవాదమా
ముగ్గురు కొడుకులు ఉన్న ఒక తల్లి ఒంటరిగా బతుకుతోంది
ఒంటరిగా ఉన్న ఆడదానికి భద్రత లేదు
ఏవుందీ  దొంగలు ఆవిడని దోచుకొని చంపేసేరు
ఈ పాపం ఎవరిది కొడుకులది వాళ్ళకి తల్లి బరువై పోయింది
మరి మిమ్మల్ని కడుపులో మోసినప్పుడు ఆవిడ  బరువు  అనుకుంటే మీరు పుట్టేవారా
ఇంత  హింస పెరగడానికి కారణం చాలావరకు ఫోన్లు టీవీలు
కొన్ని ఛానళ్ళలో యదార్ధ సంఘటన పేరుతొ భయంకరంగా  చూపెడుతున్నారు
వీటికి సెన్సార్ ఉంటె బావుంటుంది
చేతనైతే మంచి చెప్పండి లేకపోతె లేదు
ఎలక్ట్రానిక్ టెక్నాలజీ పెరిగేక హింస పెరిగింది
ఇవి లేనప్పుడు ప్రశాంతంగా ఉండేది.
ఏ వస్తువయినా మంచికి వాడొచ్చు చెడుకి వాడొచ్చు
పెన్నుతో కథలు రాయవచ్చు
ఫోర్జరీలు చెయ్యవచ్చు
ఏదయినా వాడుకోవడంలో ఉంది
మన మనసు మనకి సాక్షి
అదే మనకి మంచి చెడు  చెప్తుంది
ఏ పూజలు వ్రతాలూ మన పాపాల్ని చెరిపే రబ్బర్లు కావు
కడిగేసి డిటర్జెంట్లు కావు
మనం చేసిన తప్పుల ఫలితం మనవే అనుభవించాలి
నేను ఇదివరకే చెప్పేను ప్రవచనాలు చెప్పడం లేదని
అందుకే అడుగుతున్నాను పరిస్థితిని మార్చమని
ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తే మనుషులం అనిపించుకుంటాం
ఎవరు మారుస్తారు
కనీసం ప్రయత్నించండి
ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను
మానవత్వం మంట  కలపకండి
మంచి మనుషులుగా బతుకుదాం

 

బీనా దేవి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment