KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ పోరాటం విషయంలో ఉద్యమ నాయకుడిగా కేసిఆర్ చేసిన పోరాటం మరువలేనిది. ఇక దాదాపు తెలంగాణ రాదు… అని అనుకున్న సమయంలో.. అప్పటి కాంగ్రెస్ హయాంలో.. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన అనంతరం వెంటనే కెసిఆర్ దీక్షకు దిగడం పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం..యుపిఎ ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది.
రాదు..ఇంకా ఏర్పడదు అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ తన పోరాట పటిమతో.. సాధించి చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణాలో వచ్చిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ప్రభుత్వాన్ని స్థాపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రాణించడం తెలిసిందే. అటువంటి కేసీఆర్ బయోపిక్ నీ తెరకెక్కిస్తాం అంటూ కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రకటన చేశారు. త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల విషయంలో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.
“ది కాశ్మీర్ ఫైల్స్” సినిమా బాగా వచ్చిందని తెలిపారు. ఇక ఇదే సమయంలో తన తాజా చిత్రం “డేంజరస్” ప్రమోషన్ పనుల్లో ఆర్జివి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిల మధ్య లెస్బియజం ప్రధాన అంశంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమాలో అప్సర రాణి, నైనా గంగూలి లు… ప్రధాన పాత్రలు చేయడం జరిగింది. తెలుగు రాజకీయాలకు సంబంధించి పరిటాల రవి, వంగవీటి మోహన్ రంగా, స్వర్గీయ ఎన్టీఆర్.. మరికొంతమంది సినిమాలోని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ తీస్తా అని ఆర్జీవి అనటం రాజకీయంగా సినిమాపరంగా సంచలనంగా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!