సినిమా

Alia Bhatt- Ranbir Kapoor: పెళ్లైన 3 రోజుల‌కే అలియాకు షాకిచ్చిన రణ్‌బీర్.. అస‌లేమైందంటే?

Share

Alia Bhatt- Ranbir Kapoor: బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్‌లు మూడు రోజుల క్రిత‌మే పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఐదేళ్ల నుంచీ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ జంట‌.. ఎట్ట‌కేల‌కు మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన వాస్తు లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల, ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌ సమక్షంలో వీరి వివాహం జరిగింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్ప‌టికే నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే పెళ్లైన 3 రోజుల‌కే అలియా భ‌ట్‌కు ర‌ణ్‌బీక్ షాకిచ్చాడు. అస‌లేం జ‌రిగిందంటే.. పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను గ‌డిపేందుకు అలియా కొత్త సినిమాలేమి ఒప్పుకోవ‌డం లేదు. అలాగే ఆల్రెడీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ నుంచి సైతం త‌ప్పుకుంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కానీ, కొత్త పెళ్లి కొడుకు రణ్‌బీర్ కపూర్ మాత్రం పెళ్లయిన 3 రోజులకే అలియా వ‌దిలేసి త‌న సినిమాల‌తో బిజీ అయిపోయాడు. రణ్‌బీర్ హీరోగా చేస్తున్న చిత్రాల్లో `యానిమల్` ఒక‌టి.సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను టీ సిరీస్ వారు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా గురించి ప‌లు చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ర‌ణ్‌బీర్ క‌పూర్‌.. తాజాగా ముంబైలోని టీ సిరీస్ ఆఫీస్‌ను వ‌చ్చారు. ఈ క్ర‌మంలోను స‌ద‌రు ఆఫీస్‌ బయట ఫొటోలకు ఫోజులిచ్చాడు. దాంతో ఆయ‌న ఫొటోలు కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. దీంతో నెటిజ‌న్లు `ఏంటీ ర‌ణ్‌బీర్‌.. అలియాను ఇంట్లో వ‌దిలేసి సినిమా ప‌నులు చూసుకుంటున్నావా..? ఇది నీకు న్యాయ‌మేనా..?` అంటూ ఫ‌న్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CccsMw2qnIZ/?utm_source=ig_web_copy_link

 


Share

Related posts

మరో అరుంధతిలా ఉందే…

Siva Prasad

అనుపమ పరమేశ్వరన్ కి అవకాశాలు తగ్గింది అందుకేనా.. టాప్ సీక్రెట్ రివీలైందిగా..?

GRK

పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ లో హీరో ఆయనే..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar