NewsOrbit
Entertainment News సినిమా

Oscar for RRR:”RRR”కి ఆస్కార్ వచ్చేలా రంగంలోకి అమెరికా డిస్ట్రిబ్యూటర్ లు సంచలన నిర్ణయం..!

Oscar for RRR: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని “RRR” పెంచేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ తర్వాత రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొట్టిన సినిమాగా “RRR” మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమా చూసిన చాలామంది హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్ లు దర్శకుడు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖ నిర్మాతలు రాజమౌళితో వర్క్ చేయడానికి కూడా రెడీగా ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఇదే సమయంలో హాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్స్ కచ్చితంగా “RRR” కి ఆస్కార్ రావటం గ్యారెంటీ అన్న విధంగా కథనాలు ప్రచురించాయి.

India Snubs Hit Musical 'RRR,' Chooses 'Last Film Show' for the Oscars International Race

ఇదిలా ఉంటే ఇటీవల భారత్ నుండి ఆస్కార్ కి నామినేషన్ ల విషయంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ సభ్యులు గుజరాతి సినిమా “చలో షో” నీ ఆస్కార్ కి నామినేట్ చేయడం జరిగింది. దీంతో మొదటి నుండి ఆస్కార్ కి “RRR” వెళ్తుందని భావించిన గాని చోటు దక్కకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కచ్చితంగా ఇది సౌత్ ఇండియాని అవమాన పరచడమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. “RRR” పాన్ ఇండియా రేంజ్ లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా… మంచి గుర్తింపు సాధించింది. కానీ ఎవరికీ కనీసం తెలియని గుజరాతి సినిమా “చలో షో” ఆస్కార్ కి నామినేట్ చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. “RRR” దేశభక్తి నేపథ్యంలో వచ్చి ప్రతి సీన్ చూసే ప్రేక్షకుడు రోమాలు నీక్కబడుచుకునేలా చేసింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలై దాదాపు 14 వారాలపాటు నెంబర్ వన్ పొజిషన్ లో ట్రెండింగ్ అయింది.

How the Indian Action Spectacular 'RRR' Became a Smash in America - The New York Times

“RRR” సినిమా చూసి చాలామంది హాలీవుడ్ ప్రముఖులు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ క్రమంలో అసలు ఎవరికీ తెలియని సినిమాని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి ఆస్కార్ కి నామినేట్ చేయడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో “RRR” అమెరికా డిస్ట్రిబ్యూటర్లు.. “RRR” కి ఆస్కార్ వచ్చేలా రంగంలోకి దిగారు. ఆస్కార్ కి సంబంధించి అన్ని కేటగిరీలలో “RRR”కి వచ్చేలా ప్రచారం చేయటానికి రెడీ అయ్యారు. 14 వారాలపాటు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అయిన నేపథ్యంలో.. ఉత్తమ చిత్రం, బెస్ట్ యాక్టర్స్, సహాయ నటి కేటగిరీలలో నామినేట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆస్కార్ కమిటీకి చెందిన పదివేల మంది సభ్యులకు బిగ్ స్క్రీన్ లో RRR చూపించడానికి అమెరికా డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పైగా ఆస్కార్ అకాడమీ నిబంధనల ప్రకారం 2022లో విడుదలైన చిత్రాలు లాస్ ఏంజిల్స్ లో ఒక వారం ప్రదర్శితమై ఇంగ్లీష్.. సబ్ టైటిల్స్ కలిగి ఉంటే చాలు. ఈ నిబంధనలో ప్రకారం కమిటీ సబ్యులకు స్పెషల్ షో వేసి “RRR” నీ ఆస్కార్ కి నామినేట్ చేయడానికి అమెరికా డిస్ట్రిబ్యూటర్లు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N