Kalaavathi Song: సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా మే 12వ తారీకు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు మేకోవర్ ఇప్పటికే మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఇదే సమయంలో తమన్ అందించిన మ్యూజిక్.. ముఖ్యంగా కళావతి సాంగ్ సోషల్ మీడియాలో తిరుగులేని రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. “కళావతి సాంగ్” లో మహేష్ వేసిన స్టెప్పులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.
ఇటువంటి తరుణంలో ఇటీవల ఈ పాటకు సంబంధించి.. మహేష్ కూతురు సితార కూడా.. స్టెప్పులు వేసి వీడియో ని సోషల్ మీడియాలో వదలడంతో బాగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్ కీర్తిసురేష్ కూడా స్పెషల్ గా.. కళావతి పాటకు స్టెప్పులు వేస్తూ.. రిలీజ్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. డాన్స్ మాస్టర్ శేఖర్ తో కలసి “కళావతి సాంగ్” కు మహేష్ బాబు మాదిరిగా స్టెప్పులు వేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో వైరల్ గా మారింది.
తమన్ స్టెప్ లు చూసి మ్యూజిక్ మాత్రమే కాదు డాన్స్ సైతం అదరగొట్టేశాడు అని నెటిజెన్లు అంటున్నారు. శేఖర్ మాస్టర్ మాదిరిగానే తమన్ కూడా ప్రొఫెషనల్ డాన్సర్ గా స్టెప్పులు వేస్తున్నారని.. మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున తమన్ కళావతి డాన్స్ స్టెప్పులకు నెటిజన్ల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇదిలా ఉంటే కూతురు సితార వేసిన స్టెప్పులకు మహేష్ రియాక్ట్ అయి తన కంటే సితార బాగా వేసిందని.. స్పందించారు. ఈ క్రమంలో తామన్ స్టెప్పులకు మహేష్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.