Salaar: ప్రభాస్ “సలార్” సినిమా వాయిదా పడటం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. “కేజిఎఫ్” దర్శకుడితో ప్రభాస్ వర్క్ చేయటమే సంచలనం సృష్టించింది. “కేజిఎఫ్” సినిమాలతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించారు. ఈ సినిమా అనేక రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్ 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అటువంటి దర్శకుడుతో దేశవ్యాప్తంగా మాస్ ఇమేజ్ కలిగిన హీరో ప్రభాస్ సినిమా చేయటంతో “సలార్” పై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఫిలిం యాక్టర్స్ వెనకడుగు వేయడంతో ఈ వార్త ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది.
సినిమాకి సంబంధించి సిజి వర్క్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పాటు అనుకున్న సమయానికి ఇచ్చే పరిస్థితి ఉండదని.. సిజి వర్క్ టీం తెలియజేయడంతో.. ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు టాక్. వాస్తవానికి సెప్టెంబర్ 28వ తారీకు “సలార్” మొదటి భాగం రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆలస్యం అవుతూ ఉండటంతో సెప్టెంబర్ 28 లాంగ్ వీకెండ్ కావడంతో మిగతా సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం “రూల్స్ రంజన్” విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడం జరిగింది. ఇదే సమయంలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు, రామ్ పోతినేని స్కంద కూడా.. సెప్టెంబర్ నెలకి విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క సల్లార్ వాయిదా పడినట్లు మేకర్స్ ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించకపోవడంతో.. గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సెప్టెంబర్ నెల ఆఖరికి విడుదల చేయడానికి సిద్ధమవుతున్న.. వాళ్లు టెన్షన్ పడుతున్నట్లు టాక్.
మరోపక్క “సలార్”.. వాయిదా వార్తలు విషయంలో సన్నిహితుల వైద్య అదంతా ఫేక్ అని ప్రభాస్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పుడు సెప్టెంబర్ చివరకు విడుదల చేయాలని రెడీ అవుతున్న వాళ్లు డైనోసార్ సలార్ కి బలై పోతాము ఏమో అన్న భయం లో ఉన్నారట. సినిమా వాయిదా అనేది కన్ఫామ్ కాదని ప్రభాస్ సన్నిహితుల వద్ద చెప్పిన మాట.. సెప్టెంబర్ చివరిలో విడుదల చేయాలని అనుకుంటున్నా వారికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తూ ఉన్నట్లు టాక్. ఏది ఏమైనా సలార్ వాయిదా అన్నట్లు వస్తున్న వార్తలలో మేకర్స్ ఇంకా కన్ఫామ్ చేయకపోవడం.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గందరగోళానికి గురి చేస్తూ ఉంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!