Krithi Shetty: కృతి శెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ పేరు మారుమోగిపోతుంది. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు ఇలా వరసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్గా గుర్తింపు పొందిందీ బ్యూటీ. కృతి శెట్టితో సినిమా చేస్తే హిట్టు ఖాయం అన్న నమ్మకం ఈపాటికే చాలా మందికి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌కి చెందిన ఓ హీరో కృతి శెట్టిపై భారీ ఆశలు పెట్టేసుకున్నాడు.
ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మన సుధీర్ బాబు. ప్రస్తుతం కృతి శెట్టి చేస్తున్న చిత్రాల్లో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఒకటి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. బెంచ్‌మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో సుధీర్ బాబు ఫిల్మ్ డైరెక్టర్‌గా, కృతీ కళ్ల డాక్టర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తర్వలోనే విడుదల కానుంది. ఇకపోతే సుధీర్ బాబుకు సరైన హిట్టు పడి చాలా కాలమే అయింది.
మంచి హిట్ కొట్టాలనే క్రమంలో ఆయన అనేక ప్రయోగాలు కూడా చేశారు. అయినా ఫలితం దక్కలేదు. ఇక ఇప్పుడు ఈయన ఆశలన్నీ కృతి శెట్టితో చేస్తున్న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా మీదే ఉన్నాయి. మరి కృతి శెట్టి తన లక్కు కాస్త సుధీర్ బాబుకు కూడా ఇచ్చి హిట్ ఇస్తుందో..?లేక ముంచేస్తుందో..? తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!