Trust: చాణుక్యుడు ఈ సమాజం లో ఉన్న అనేక రకాల విషయాల గురించి నీతి వాక్యాలు చెప్పారు. అవి మానవ జీవితానికి ఎంతో ఉపయోగకరం గా ఉంటాయి. వాటిని శ్రద్దగా అనుసరిస్తే జీవితం చాలా సుఖమయం గా ఉంటుంది. అలాగే ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం జీవితం లో ఎలాంటి వారిని నమ్మవచ్చు .. ఎవర్ని నమ్మకూడదు అనే విషయం మీద చాణుక్యుడి సూచనలు గురించి తెలుసుకుందాం.
Trust: ఆనందాలను వదులుకోవడం..
ఆచార్య చాణక్యుడు వివరించిన దాని ప్రకారం, ఇతరుల కోసం తమ ఆనందాన్ని త్యాగం చేసే వారు ఎప్పటికీ ఇతరులను మోసం చెయ్యరు. అలాంటి మనస్సు ఉన్న వ్యక్తులు నిస్వార్ధపరులు గా ఉంటారు. వారిని నమ్మడం లో ఎలాంటి సందేహం అవసరం లేదు. అదే స్వార్థపరులైన వ్యక్తులు అయితే ఎప్పుడు తమ గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు . అలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది.
దాతృత్వాగుణానికి
దాతృత్వాగుణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతే ఉంది. దానం చేయడం అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమేకాదు.. నిజాయితీగా మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా సహాయం చేయడం కూడా అని అర్ధం. మనసు స్వచ్చంగా, నిజాయితీతో ఉండేవారు ఎప్పుడు మోసం చేయరు. అలాంటి వారితో ఎలాంటి అనుమానం లేకుండా స్నేహం చేయవచ్చు. వారు మిమ్మల్ని ఎన్నడూ మోసం చెయ్యరు.
ధర్మం వైపు
చాణక్యుడు తెలియచేసినదని ప్రకారం.. ధర్మం వైపు నడిచే వ్యక్తి ఎలప్పుడూ ధర్మం గానే డబ్బును సంపాదిస్తాడు. అలాంటివారిని ఎప్పుడు నమ్మవచ్చు. ఎందుకంటే వారు ఎట్టి పరిస్థితి లో కూడా మిమ్మల్ని మోసం చెయ్యరు. అలాంటివారితో స్నేహం చేయడం మంచిది.
నిజాలు మాట్లాడేవారు
ఎప్పుడూ నిజాలు మాట్లాడేవారు ఎవర్ని మోసం చెయ్యరని ఆచార్య చాణక్యుడు అన్నారు. అదే విధం గా అబద్దాలు చెప్పేవారికి దూరంగా ఉండాలట. ఎందుకంటే అలాంటి వారు తమ సొంత ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఇబ్బందులలు పడేవడానికి ఏమాత్రం ఆలోచించరు .