NewsOrbit
5th ఎస్టేట్

కరోనా కాటు – ప్రపంచానికి పాఠం

sample 7 వేలాది మందిని చంపేస్తుంది…! లక్షలాది మందిని ఆసుపత్రిపాలు చేస్తుంది…! కోట్లాది మందిని గడగడలాడిస్తుంది…! ఆరు వందల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది…! ఆ అంతటి భయానక లక్షణాలున్నది ఎవరో ఇప్పటికే కనిపెట్టేసే ఉంటారు. కరోనా…! ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇది చేస్తున్నచెడు కంటే… ఆధునిక ప్రపంచానికి నేర్పిస్తున్న, చెప్తున్న పాఠం ఎక్కువగా ఉంది. బయటకు కనిపిస్తున్న భయంతో పాటు లోపల నేర్చుకుంటున్న పాఠాన్ని తెలుసుకోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా ఈ ప్రపంచానికి అప్రమత్తత అనే పాఠాన్ని నేర్పిస్తుంది.చైనాను ఇక నమ్మలేం…! ఇప్పటి వరకు చైనాపై ప్రపంచ చూపు ఒకలా ఉండేది. ఇకపై ఒకలా ఉంటుంది. చైనా అంటే ఆధునిక ప్రపంచాన్ని సాంకేతికతతో జయిస్తున్న అద్భుత దేశం. ఆర్ధికంగా ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుంటూ, అమెరికాకి సవాలు విసురుతున్న శక్తి. కానీ ఆ ఆర్ధిక, సాంకేతికత శక్తి కంటే ఇప్పుడు చైనా అంటే “కరోనా” గుర్తొస్తుంది. ఆ దేశ ఆహారపు అలవాట్లు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఏది తినకూడదు, తినొచ్చు అనేది చర్చకు దారి తీసింది. మొత్తానికి చైనా నుండి అన్నిటినీ దిగుమతి చేసుకోకుండా సొంతంగా ఉత్పత్తి మంచిది అని ఇతర దేశాలకు తెలిసొచ్చింది. అందుకే ఇండియా సహా, ఇరాన్, పాకిస్థాన్, ఇటలీ వంటి ఇరవైకి పైగా దేశాలు ఇది వరకు చైనా నుండి దిగుమతి చేసుకునే సాధారణ వస్తువులను కాదని, స్వదేశంలో తయారయ్యే వస్తువులకు గిరాకీ ఏర్పడేలా చేశాయి. (చైనా నుండి ఆధారపడకుండా సొంతంగా ఉత్పత్తి చేసుకోవడం అనే సందేశాన్ని ఇతర దేశాలకు కరోనా ఇచ్చింది, ఇదే సమయంలో కేవలం పది రోజుల్లోనే పదివేల పడకల ఆసుపత్రిని నిర్మించే సత్త ఉన్న చైనాకు తమ బలం, బలహీనత తెలిసేలా చేసింది. ఎంత అడిగిన ఒక్క వైరస్ వచ్చి అతలాకుతలం చేస్తుందంటూ అప్రమత్తత పాఠం నేర్పింది)వైరస్ వస్తే అంతే…! మనిషి మెదడు విర్రవీగుతుంది. కంప్యూటర్ సృష్టి, మొబైల్ సృష్టి, రోబో సృష్టి… అంటూ హద్దుల్లేని దశలు దాటి సాంకేతికత పరుగులు పెడుతున్నదశలో కరోనా హెచ్చరిస్తుంది. “మీరెన్నికనిపెట్టిన వైరస్ దాటికి తట్టుకోలేరు” అంటూ అప్రమత్తత చాటుతుంది. ఒకప్పుడు ఫ్లూ, తర్వాత క్షయ, తర్వాత పోలియో.., తర్వాత ఎయిడ్స్ వచ్చి భయపెట్టాయి. కానీ ఇవేమి ఇంత వేగంగా వ్యాప్తి చెందలేదు. కరోనా ఉనికి ప్రపంచానికి తెలిసి కేవలం మూడు నెలలే అయింది. కానీ కరోనా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రోజుకి సగటున పది వేల మందికి సోకుతుంది. వారిలో రోజుకి సగటున వేయి మంది మరణిస్తున్నారు. ప్రస్తుత లెక్కలు చుస్తే చైనాలో అధికారికంగా 3410 మంది, ఇటలీలో 2200 మంది మరణించారు. ఇరాన్, స్పెయిన్, దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్ లో అధికారిక లెక్కల ప్రకారం 130 మందికి ఖరారు చేయగా, వారిలో ముగ్గురు మరణించారు. ఇలా సాంకేతికత, ఆధునికత అంటూ పరుగులు పెడుతున్న ప్రపంచాన్ని ఒక్క వైరస్ ఆపేసింది. ముందు “తనను జయించండి” అంటూ సవాలు విసిరింది. మానవ మెదళ్ళకు, శాస్త్రవేత్తల పరిశోధనలకు పెనుసవాలుగా మారింది. దీని తర్వాత మరోటి వస్తే ఎలా? అనే భయాన్ని కలిగించింది. అందుకే ఎంత సాంకేతికత, ఆధునికత ఉన్నా శుభ్రం, ఆహార శుద్ధి ముఖ్యమనే ప్రాధమిక సూత్రాన్ని ప్రపంచం గుర్తించేలా మేలు చేసింది కరోనా.మార్కెట్లు ముంచింది…! రూపాయి విలువ తగ్గిపోతుంది. అమెరికా డాలర్ విలువ పెరుగుతుంది. బంగారం ధర పెరిగిపోతుంది. చమురు ధరలు పెరుగుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాల ఆదాయం మాత్రం పెరగడం లేదు. వాటన్నిటికీ కరోనా కంట్రోల్ చేసింది. అక్కడకు అలా ఆపింది. చమురుని కిందకు దించింది. చమురుని ఉత్పత్తి చేసి, ఎగుమతులు చేసే 14 దేశాలు ప్రస్తుతం కరోనాతో అల్లాడుతున్నాయి. అక్కడ ఉత్పత్తి అయితే పెరిగింది. కానీ ఇతర దేశాల్లో వాడకం తగ్గింది. అంటే ఉత్పత్తి పెరిగి, వాడకం తగ్గితే నిల్వలు పెరిగి ధరలు దిగి రావాల్సిందే. కరోనా కారణంగా సరఫరా తగ్గి, నిల్వలు ఎక్కువయ్యాయి. ఈ ఫలితంగా ధర కూడా తగ్గింది. ఇదే సమయంలో చమురు చుట్టూ అల్లుకుని ఉండే మార్కెట్ ధరలు తగ్గాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లు, బంగారం తదితరాలపై పడింది. మధ్య తరగతికి కాస్త ఊరట కలిగించేలా ధరలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఇటు ఖర్చులు తగ్గి, అటు ప్రయాణాలు తగ్గి, మరోవైపు ధరలు తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా కాస్త ఊరట లభించింది. ముఖ్యంగా మార్కెట్ సూచీలు ఆకాశం నుండి డమాలని నేలకు పడ్డాయి. ఇది మార్కెట్ ని ముంచినప్పటికీ, మదుపరులకు అప్రమత్తత చెప్పింది.శుభ్రత పాఠాలు బోధించింది…! షేక్ హాండ్స్(కరచాలనం) .., హగ్గులు(కౌగిలింతలు) ఎక్కువయ్యాయి. పాశ్చాత్యపు సంస్కృతిని దేశం కూడా నలుమూలలా విస్తరించింది. నమస్కారం చేసుకోవడం దాదాపు కనుమరుగయ్యింది. మారిపోతున్న జీవన శైలిలో శుభ్రతకు కూడా షార్ట్ కట్లు వచ్చేసాయి. వాటన్నిటి నుండి ఈ ఒక్క వైరస్ పాఠం నేర్పించింది. పూర్వపు నమస్కారాన్ని మళ్ళీ అలవాటు చేసింది. షేక్ హాండ్స్, హగ్గులు వలన వైరస్లు వ్యాప్తి ఉంటుందని పాఠం చెప్పింది. శుభ్రతకు షార్ట్ కట్ మానుకుని రోజుకి ఆరు సార్లు శుభ్రం చేసుకోవాలని చాటింది. మొత్తానికి మానవుడు తనను తానూ రక్షించుకోవాలంటే కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పింది.ఖర్చులు తగ్గించింది… అందరినీ ఇంటిలో చేర్చింది…! ఆధునికత, సాంకేతికత పెరిగి షాపింగులు, సినిమాలు విపరీతమయ్యాయి. మధ్య తరగతి వాళ్ళు కూడా వీటికి బానిసలవుతున్నారు. కరోనా ఆ కొరత తీర్చింది. ఖర్చులు మిగిల్చింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై సహా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు మూతపడ్డాయి. ఈ ప్రభావంతో ఇంటిల్లిపాదీ ఇంటికే పరిమితమై ఉంటున్నారు. ఖర్చులు తగ్గాయి, ఇంట్లో గడిపే అవకాశం వచ్చినట్లయింది. పూర్వపు రోజుల్లో ఇంటిల్లిపాదీ ఇళ్లల్లోనే గడుపుతూ ఆహ్లాదంగా గడిపేవారు కరోనా పుణ్యమా అంటూ ఇలా మళ్ళి ఆ అవకాశాన్ని కల్పించింది.Srinivas Manem

author avatar
Siva Prasad

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment