NewsOrbit
5th ఎస్టేట్

జగన్ మనసు మళ్ళీ మండలి వైపు ?

sample 6 ఈ మండలి వ్యవస్థ జగన్ కి అనేక తలనొప్పులు తీసుకొస్తుంది. పాపం మూడు రాజధానుల కథకి విరామం పడడానికి మండలి అడ్డుగా ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డని సాగనంపాలన్న మళ్ళీ మండలి అడ్డు వస్తుంది. పాపం… జగన్ కి సీఎం అయిన పది నెలలలోనే మండలి రూపంలో ఇన్ని అవాంతరాలు వస్తాయనుకోలేదేమో. అందుకే ఇప్పుడు అత్యవసరంగా మండలిని రద్దు చేయించాలి. అందుకు అవసరమైతే అమిత్ షా వయా అంబానీ వయా నత్వాని వెళ్లాల్సిందే. అదన్నమాట సంగతి. నిమ్మగడ్డ రమేష్ ని పంపించాలంటే మండలి అడ్డు ఏమిటో కాస్త తెలుసుకుందాం పదండి.రమాకాంత్ రెడ్డి ఇచ్చిన సూచన ఇదే…!రమాకాంత్ రెడ్డి అందరికి గుర్తుండే ఉంటారు. ఒకప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్ కూడా. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి ప్రశాంతంగా ఉంటున్నారు. ఈయన వైఎస్ కుటుంబానికి సన్నిహితులు. ఈ చనువుతో జగన్ ఇటీవల రమాకాంత్ రెడ్డితో కీలక భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలను స్వీప్ చేస్తున్నాం అనుకున్న సమయంలో రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసేసారు. కేంద్రానికి పిర్యాదులు చేసారు. ఇక ఈయన ఉండగా మనం అనుకున్నది చేయలేము..! దీనికి పరిష్కారం ఏంటి?? అంటూ ఆరాలు తీశారు. వెంటనే రమాకాంత్ కి నాడు శేషన్ విషయంలో పివి నరసింహారావు చేసిన పన్నాగం గుర్తొచ్చింది. అదేమిటనగా “ఎన్నికల కమిషనర్ ని ఒకరి నుండి ముగ్గురు సభ్యులుగా పెంచడం. అంటే ఇప్పుడున్న కమిషనర్ వ్యతిరేకంగా ఉన్నా కొత్తగా వచ్చే ఇద్దరూ మనకు అనుకూలులు వస్తే మెజారిటీతో అనుకున్ననిర్ణయాలు అమలు చేయవచ్చు” అన్నమాట. నాడు పివి ప్రధానిగా ఉండగా సేషన్ ఇదే తీరున చేశారని ముగ్గురు సభ్యులను పెట్టి, సేషన్ని డమ్మీని చేశారని” రమాకాంత్ రెడ్డి జగన్ కి గుర్తు చేసారు. అంటే ఇప్పుడు రమేష్ కి తోడుగా మరో ఇద్దరు కమిషనర్లని నియమించి వారి ద్వారా తమ నిర్ణయాలు అమలయ్యేలా చూడడం. తొలగించడం కష్టం కానీ, లాబీయింగుల ద్వారా నియమించడం సులువే.కానీ… మండలి అడ్డమే…! ఇది జరగాలంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ముగ్గురు కమిషనర్లు అవసరమంటూ శాసనసభలో తీర్మానం చేయాలి. దాన్ని మండలిలో ఆమోదించాలి. అది గవర్నర్ కి చేరి తద్వారా కేంద్రానికి వెళ్తుంది. కేంద్రం ఆమోదం తర్వాత రాష్ట్రపతి అనుమతిస్తే ముగ్గురు కమిషనర్లు వచ్చేస్తారు. వచ్చే వారిని తమ వారిని తెచ్చుకోవడం జగన్ కి సులువే. కానీ ఇప్పటికిప్పుడు ఆ తీర్మానం చేయడమే కష్టం. అసెంబ్లీలో ఆమోదించినా, మండలిలో కచ్చితంగా అడ్డు పడుతుంది. పోనీ త్వరగా మండలిని రద్దు చేసే బిల్లుని పార్లమెంటు ఆమోదించి, త్వరగా రద్దు చేయాలన్నా కనీసం ఆరు నెలలు పడుతుంది. అసలు బిజెపిలో ఆ కదలికలు లేవు. ఇదీ కథ. పాపం జగన్ కి రెండు నెలల వ్యవధిలోనే మండలి గండం మళ్ళీ వచ్చి పడింది.

author avatar
Siva Prasad

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment