NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

Eenadu Ramojirao: కన్నీటి తెలుగు – ఓహో.. “రామోజీ గారూ” మీరు పెంచిన భాషని మీరే చంపేస్తారా..!?

Eenadu Ramojirao: Killing Telugu language Words..

Eenadu Ramojirao: “ఈనాడు పెద్దాయన రామోజీ రావు గారికి… తెలుగు భాష వినమ్ర పూర్వకంగా రాసుకుంటున్న విన్నపం…!!
అయ్యా…! తమరు పెద్దలు. తమరు నాలుగున్నర దశాబ్దాలుగా “ఈనాడు” అనే పత్రిక ద్వారా ఎదుగుతూనే.. నన్నూ ఆదరించారు. నన్నూ పెంచి పోషించారు. పరదేశీ భాషా పైత్యంతో అణచబడుతున్న నన్ను నలుమూలలకు విస్తరించారు. మనోళ్లకు నా రుచిని పరిచయం చేశారు. నన్ను ఆదరిస్తే ఉన్న మజాని చాటారు. నా అభిమానులను ఒక్కతాటిపైకి చేర్చారు. నా వెలుగుని శిఖరాగ్రాన ఉంచే ప్రయత్నం చేశారు. అందుకు నేను మీకు – మీరు నాకు కృతజ్ఞులమే..! అయ్యా..!! కానీ నేనేం పాపం చేసాను..? నన్నెందుకు కొన్ని నెలలుగా మానసికంగా విసిగిస్తున్నారు..? నన్నెందుకు కొన్ని నెలలుగా శారీరకంగా వేధిస్తున్నారు..? నాలో రుచిని మార్చేస్తున్నారు..? నాలో లేని అర్ధాలను తీస్తున్నారు..? నాలో లేని పదాలను పుట్టిస్తున్నారు..? నాలో లేని భావాలతో బాధిస్తున్నారు..? నాలో రుచిని ఆస్వాదించిన మీ పాఠకులే నాకు లేని రుచిని మీరు చూపిస్తున్న కారణంగా నన్ను కొత్తగా/ వింతగా చూస్తున్నారు. ఇది మీకు తగునా..!? మీ లాంటి పెద్దలకు సబబేనా..!? బహుశా.., మీరు చూడడం లేదేమో మీ పత్రికలో ఈ మధ్య వస్తున్నా వాఖ్యాలనూ.., పదాలను ఓ సారి కళ్లారా చూసి తరించండి..!!

Eenadu Ramojirao: Killing Telugu language Words..
Eenadu Ramojirao Killing Telugu language Words

Eenadu Ramojirao: ఏం రాసారో చూడండి..!!

తెలుగు పదాలు తెలుగులో బాగుంటాయి. రాయడానికి, చదవడానికి, చూడడానికి ముచ్చటగా అనిపిస్తాయి. మురిపిస్తాయి. తెలుగు భాషాభిమానులకు మైమరపిస్తాయి..! తెలుగుని తెలుగులోనే చెప్పడంలో, రాయడంలో ఈనాడు – ఈటీవీ సంస్థలు ప్రత్యేకమైనవి. గడిచిన కొన్ని ఏళ్లుగా తెలుగు భాష ఔన్నత్యం, గొప్పతనం కాపాడడం కోసం ఈ సంస్థలు చేస్తున్న కృషి తెలుగు వాళ్ళు.., తెలుగు భాషాభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. రామోజీ కూడా తెలుగు భాషాభిమాని. ఆయనకు తెలుగు అంటే పిచ్చి. సరే.. అంతటి రామోజీ మానస పుత్రిక ఈనాడులో ఈ మధ్య తెలుగుని చంపేస్తున్నారు. పనిగట్టుకుని మరీ ఇటుక ఇటుక పేర్చుకుని కట్టుకున్న తెలుగింటిని .. తెలుగు వికృతాలతో ఈనాడు వాళ్ళే చంపేస్తున్నారు. నమ్మశక్యంగా లేదా.. ఈ వార్త చూడండి..!

“నిత్యధన యంత్రం మాయం” ఇది చదివి “ఇదేదో చేతబడి యంత్రమో.. క్షుద్రపూజల యంత్రమో.. దిష్టి పూజలు చేసి మంత్రాలు వేసి నిత్యం ధనం ఉంచే యంత్రమో కాదు.. “ఏటీఎం” ఆ నిత్యధన యంత్రం అంటే మనం ఏటీఎం అని అర్ధం చేసుకోవాలి. లేకపోతే ఈ వార్త అర్ధం కాదు. వార్త అర్ధం కాకపోతే ఇదేదో మొదట చెప్పుకున్న చేతబడి యంత్రం లాగానో.., క్షుద్రపూజల యంత్రంగానో అనిపిస్తుంది..! “బీదర్ జిల్లాలోని ఔరత్ పట్టణంలోని నిత్యధన కేంద్రంలోని నిత్యధన యంత్రం మాయమైందట. అందులో ఎంత నగదు ఉందొ పోలీసులకు తెలియదట, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. అదీ మేటర్.

Eenadu Ramojirao: Killing Telugu language Words..
Eenadu Ramojirao Killing Telugu language Words

* ఏటీఎం ని తెలుగులో రాయాలి అన్న ఈనాడు తపనకు ఒక అభినందన. కానీ నిత్యధన యంత్రం.., నిత్యధన కేంద్రం అంటూ పైత్యపు తెలుగు రాసిన మీ పైత్యానికి ఒక దండం. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (దాన్ని వాడుకలో ఎనీ టైం మనీ) అంటారు. ఈ అనీ టైం మనీని తెలుగులోకి అనువదించి ఒక కొత్త క్షుద్ర, దిష్టి యంత్రాన్ని సృష్టించినట్టు.. నిత్యధన యంత్రంగా మార్చేశారు..! ఏటీఎం, కంప్యూటర్, మౌస్, మాస్కు, కీ బోర్డు..వంటి కొన్ని పదాలు ఇంగ్లీష్ లోనే బాగుంటాయి. అలవాటయ్యాయి, తెలుగుతో సర్దుకుని స్నేహం కూడా చేశాయి. వీటికి తెలుగు అనువాదాలు రాస్తే ఇలాగే పైత్యాలు బయటపడతాయి. ఇదే కాదు. ఈ మధ్య ఈనాడు రాతల్లో తెలుగుకి వాతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొన్నామధ్య ఫిబ్రవరి 21 న “అమ్మ స్థనంపై పాము కాటు” అనే వార్త.. ఫిబ్రవరి 15 న ఓ వార్తలో “రెండు రోజుల కిందట మంటలంటుకుని మృతి చెందిన వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది” (ఈ వాక్యం మళ్ళీ చదవండి) ఇలా రాసేస్తున్నారు. ఫీల్డ్ కంట్రిబ్యూటర్లు రాస్తున్నారు. డెస్క్ లో సబ్ ఎడిటర్లు దిద్దకుండా పెట్టేస్తున్నారు. వెరసి పత్రికను, పత్రికా భాషని, తెలుగుని చంపేస్తున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju