NewsOrbit
5th ఎస్టేట్

కిమ్ వచ్చేసారహో…!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ యాన్ వచ్చేసారు. ఆ దేశ మీడియాకి కనిపించారు. స్వయంగా ఆ దేశ మీడియా ఈరోజు వెల్లడించింది. కిమ్ కి ఏమైంది? కనిపించడం ఏంటి? అనుకుంటున్నారేమో…! ప్రత్యర్థులకు హెచ్చరికలు.., సూటి మాట్లాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే కిమ్ 20 రోజుల నుండి బయటి ప్రపంచానికి కనిపించట్లేదు. ఆ దేశ మీడియాకు, ప్రజలకు ఎవరికీ కనిపించలేదు. మధ్యలో ఆయనకు ఆరోగ్యం బాలేదని, ఒకానొకదశలో ఆయన మరణించారని.., ఆయన సోదరి కిమ్ యో కి దేశ పగ్గాలు ఇచ్చేస్తున్నారని… విపరీత వార్తలు వచ్చాయి. ఇవన్నీ పటాపంచలు చేస్తూ…, ఈరోజు ఆ దేశ రాజధానిలో ఎరువుల కర్మాగారం ప్రారంభానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. ఇంతకు ఈ 20 రోజుల్లో ఏమైంది? ఈ వార్తలు ఎందుకు వచ్చాయి? అనేది చూద్దాం.

దేశ కీలక రోజున రాలేదు..!

ఉత్తర కొరియాకి ఏప్రిల్ 15 కీలకమైన రోజు. దేశ ఆవిర్భావ దినోత్సవం. కిమ్ తాత కిమిల్ సంగ్ పుట్టినరోజు. ఆ దేశా ఏర్పాటలో కీలకంగా పని చేసిన కిమ్ తాత కిమిల్ సంగ్ కాబట్టి… ఆయన జన్మదినమే ఆ దేశ ఆవిర్భావ దినోత్సవంగా మారింది. దేశం మొత్తం పండగలా చేసుకుంటుంది. అధికారిక కార్యక్రమంలో అధినేత పాల్గొంటారు. అంటే… ఏప్రిల్ 15 న కచ్చితంగా కిమ్ ఈ అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ పాల్గొనలేదు. దీంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. కిమ్ చివరిగా ఏప్రిల్ 11 న మాత్రమే ఓ కార్యక్రమంలో కనిపించారు. తర్వాత అసలు బయటకు రాలేదు, ఎక్కడ ఉన్నారో తెలియలేదు. తాజాగా ఈరోజు మాత్రమే వచ్చారు.

మధ్యలో చాలా పుకార్లు…!

కిమ్ కనిపించట్లేదు. ఆయనకు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, మరణించారని అనేక పుకార్లు వచ్చాయి. అయితే దీనికి భిన్నంగా ఆయన కరోనాకి భయపడి నిర్బంధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. కిమ్ కుటుంబానికి, ఆ దేశ అధ్యక్షుడికి అధికారిక ఓ గెస్ట్ హౌస్ రాజధానికి దూరంగా ఉంది. ఆ దేశ అధ్యక్షులు, ఆ కుటుంబం కేవలం రైలులోనే ప్రయనిస్తారు. విమానంలో అభద్రత, పలు భయాలతో కేవలం వారి కుటుంబానికి ఒక ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ ఈ 20 రొజులు ఆ అధికారిక నివాసం వద్ద ఉండడంతో కిమ్ అక్కడే ఉన్నారని… బైపాస్ సర్జిరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారని… కరోనాతో భయపడి ఉండిపోయారని రకరకాల పుకార్లు వచ్చాయి. ఏది ఏమైనా…, ఈరోజు ఆయన తిరిగి కనిపించడం ప్రపంచానికి పెద్ద వార్తే.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment