NewsOrbit
5th ఎస్టేట్

పత్రికలు బేజారు.. సిబ్బంది బజారు…!

కరోనా కాలం పత్రికలను ముప్పు తిప్పలు పెడుతుంది. తెలుగునాటనే కాదు, దేశ వ్యాప్తంగా పత్రికలు తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఈ రెండు నెలల్లో దాదాపు రూ. 25 వేల కోట్లు నష్టపోయామని, ఆదుకోవాలని పత్రికల యాజమాన్యాలు ప్రధాని మోడీకి విన్నవించుకున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా నష్టాలు కంటే ముందే తెలుగునాట ప్రధాన పత్రికలకు దెబ్బ పడింది. మొన్ననే ABC (పత్రికల సర్క్యులేషన్ లెక్కలు) విడుదలయ్యాయి. 2019 జూన్ నుండి డిసెంబర్ మధ్య తీసుకున్న లెక్కలు అవి. వాటి ప్రకారం చూస్తే ఈనాడు 52 వేల కాపీలను కోల్పోయింది. జ్యోతి 39 వేలు కోల్పోయింది. సాక్షి 9 వేలు పెంచుకుంది. ఆ సంక్షోభ సమయంలో సాక్షి పెంచుకుంది అంటే అది అధికారమే. ఇక ఆ కాలం వదిలేస్తే.., కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే…!

సర్క్యులేషన్ ఇలా…!!

గడిచిన మూడు నెలల్లో ఈనాడు దాదాపు 5 లక్షల కాపీలను కోల్పోయింది. జ్యోతి 3 లక్షలు, సాక్షి 3 లక్షలు కాపీలను కోల్పోయింది. అంటే ఇవి అధికారికం కాదు, కానీ ఆ సిబ్బంది ద్వారా వచ్చిన సమాచారం. సర్క్యులేషన్ సంగతి పక్కన పెడితే యాడ్లు ఆదాయం పూర్తిగా నిల్. ఈనాడుకి సగటున నెలకు రూ. 70 నుండి రూ. 80 కోట్లు ఆదాయం యాడ్లు ద్వారానే వస్తుంది. సీజన్ లో అంటే పండగలు, పెళ్లిళ్ల , వేసవి సమయంలో ఇది రెట్టింపు ఉంటుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా కోల్పోయినట్టే. 15% మాత్రమే వస్తుంది. ఇక మిగిలిన పత్రికల సంగతి అలాగే ఉంది. సర్క్యులేషన్ లేదు, యాడ్లు లేవు. ఇంకెందుకు పత్రికలు.., ఇంకెలా వాటిని నడపడం. అందుకే ఇన్నాళ్లు పోగేసుకున్నది దాచుకుందాం, ఇక నష్టాలు భరించలేం అంటూ ఈనాడు లాంటి పెద్ద సంస్థలే చేతులెత్తేసాయి.

ఈనాడులో 1000 మందికి ఉద్వాసన…!

నీతి కబుర్లు, నిజాయితీ కథలు విపరీతంగా వల్లించే ఈనాడు సంస్థలో ఉద్యోగుల విషయంలో చేతులెత్తేసింది. అందుకే నెమ్మదిగా ఉద్యోగులను సాగనంపుతున్నారు. * మొదటిగా విశ్రాంత ఉద్యోగులు 107 మందిని ఏప్రిల్ నుండి ఆపేసింది. నిజానికి వారు ఎప్పుడో రిటైర్ అయినప్పటికీ…, వారిని వివిధ అవసరాల నిమిత్తం వాడుకుంది. ఇప్పుడు కరోనా పుణ్యామని పక్కకు నెట్టేసింది.
* గ్రామ, మండలస్థాయిలో పని చేసే కంట్రిబ్యూటర్లకు ఇచ్చే గౌరవ వేతనం తగ్గించింది. జిల్లా ఎడిషన్లు తీసేయ్యడంతో వారికి వార్తలు లేక కనీసం నెలకు రూ. 1000 కూడా రావడం లేదు.
* యాడ్స్ విభాగంలో పని చేసే 350 మందిని పక్కన పెట్టేసింది. వారిని నెలకు రూ. 6 వేలు జీతంతో పాటు కమీషన్ ఉండేది. ఉన్నట్టుండి పంపించేసింది. అవసరం లేదు అంటూ పరోక్షంగా పొగ పెట్టేసింది
* ఇక గ్రామాల్లో ఇంటింటికి తిరిగి పేపర్ తీసుకుండి అంటూ బతిమలాడే ప్రమోషన్ స్టాఫ్ 500 మందికి ఉద్వాసన పలికింది. వీరికి నెలకు సుమారుగా రూ. 10 వేలు, కమీషన్ ఉండేది.Eenadu ; Unit Offices to be Closer

అక్షరాలు అమ్మకానికి…!!

ఈనాడు పరిస్థితి అలా ఉండగా.., ఆంధ్రజ్యోతిలో మరీ దారుణ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ తొలగింపులు ఆరంభమయ్యాయి. ఆయా ఆదాయాలు ఇన్నాళ్లు బాగానే మోసుకొచ్చిన ఇప్పుడు చేతులెత్తేసాయి. సిబ్బందికి మరో ఆధారం లేక బజారున పడినట్టే. అదే ఏ కార్పొరేట్ కంపెనీలోనో తొలగింపు జరిగితే ఇవే పత్రికలు పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవి. ఇప్పుడు అవే పత్రికలు చేస్తుండడం, పాపం అక్షరాలతో రాసే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. ఒకవేళ రాసినప్పటికీ ఎల్లో, బ్లూ, ఆరంజ్ అంటూ బురద వేసుకోవడం పరిపాటిగా మెరింది.

 

author avatar
Srinivas Manem

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau