Venkatakrishna ; మొన్నటి నుండి ఒక వార్త తెలుగు మీడియా రంగంలో.. సోషల్ మీడియా పేజీల్లో తెగ తిరిగేస్తుంది. ఏబీఎన్ ఛానెల్ నుండి వెంకటకృష్ణనని ఎందుకు గెంటేశారు..! అని కానీ కారణాలు మాత్రం ఏ ఒక్కరూ స్పష్టంగా చెప్పడం లేదు. ఇదీ కారణం అనేది ఏ మీడియా, ఆ సోషల్ మీడియా బయట పెట్టడం లేదు. వైసీపీ వాళ్లేమో… వెంకటకృష్ణ రూ. 50 లక్షలు కోసం ఒకర్ని బ్లాక్ మెయిల్ చేస్తూ దొరికిపోయాడట అందుకే తీసేశారట.. అని ప్రచారం మొదలు పెట్టారు..! టీడీపీ వాళ్లేమో వెంకటకృష్ణ ఒక ఛానెల్ పెడుతున్నాడట.., అందుకే మానేసాడట అని ప్రచారం చేసుకుంటున్నారు..! కానీ వాస్తవాలు వేరు. అవేమిటో తెలుసుకునే ప్రయత్నంలో “న్యూస్ ఆర్బిట్” కొంచెం మూలాల్లోకి వెళ్ళింది..!!
Venkatakrishna ; ఇవీ ప్రధాన కారణాలు..! ఇంకా అనేకం చిన్నవి కూడా..!!
* వెంకటకృష్ణ సీనియర్ జర్నలిస్టు. ఈనాడు, టీవీ 5 వంటి సంస్థల్లో కీలక స్థాయిలో పని చేసి.. సొంతంగా ఓ న్యూస్ ఛానెల్ నడిపి వచ్చారు. స్వతహాగా గర్వి. ఎవ్వరి మాట వినేరకం కాదు. ఆయన అనుకున్నదే చేసేసే రకం. ఆయన చెప్పేదే వార్త అనుకునే రకం. ఇవే లక్షణాలు ఆ సంస్థ ఎండీ రాధాకృష్ణలో కూడా ఉన్నాయి. ఇద్దరు అహం ఉన్న వ్యక్తులు ఓ చోట ఉండలేరు. సో… కొన్ని నెలలుగా ఇద్దరికీ మధ్య ఈగో క్లాష్ అవుతూ వస్తుంది.
* వెంకటకృష్ణ గురించి మొత్తం తెలిసినా రాధాకృష్ణ అతన్ని తీసుకున్నారు. మంచి స్థానమే ఇచ్చారు. రోజువారీ డిబేట్లు బాధ్యత అప్పగించారు. కానీ ఈ డిబేట్లులో పస ఉండడం లేదు. టీవీ 5 లో మూర్తి.., టీవీ 9 లో రజనీకాంత్ లా పెద్దగా హైలైట్ అవ్వడం లేదు. కేవలం టీడీపీ వాళ్ళు కొందరు, ఏబీఎన్ పిచ్చిగా చూసే వాళ్ళు తప్పితే వేరే వర్గం రావట్లేదు. టీడీపీలో కూడా టీవీ 5 మూర్తి డిబేట్ కి వచ్చిన ఆదరణ కూడా వీకే డిబేట్లుకి రావట్లేదు.
* అమరావతి విషయంలో చేసి కొన్ని డిబేట్లు.., ఇటీవల చేసిన రిజెర్వేషన్లు ఎందుకు..? అనే డిబేట్లులోనూ ఛానెల్ కి కొన్ని చిక్కులొచ్చాయి. ఓ పెద్ద వివాదమే జరిగింది. అంతర్గతంగా పరిష్కరించుకున్నారు.
* అన్నిటి కంటే ముఖ్యంగా సంస్థ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతోనూ.. కొందరు మహిళా రిపోర్టర్లతోనూ వెంకటకృష్ణకి ఏ మాత్రం పడడం లేదు. కొన్ని నెలల నుండి అంతర్గత వివాదాలు, గట్టిగానే జరుగుతున్నాయి. ఎండీ రాధాకృష్ణకు తరచూ ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి.
* ఈ అన్ని కారణాలు మేళవించుకుని… సంస్థ పెద్దలు మొన్న భేటీ జరిపి.. వెంకటకృష్ణపై ఫిర్యాదులు, ఆరోపణలు, వివాదాలు, ఆయన వ్యవహారశైలి అన్నిటినీ చర్చింది… ఎండీ రాధాకృష్ణ నిర్ణయం మేరకు గౌరవంగా బయటకు పంపించేశారు. ఇక రావద్దు అంటూ ఫోన్ కి మెసేజ్ చేశారు. వాట్సాప్ గ్రూపుల నుండి రిమూవ్ చేసేసారు.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!