అంతే మరి .. అది దిల్లీ సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు రా … !!

Share

నెహ్రూ కుటుంబం దేనినైనా సహిస్తుంది కానీ ధిక్కారం మాత్రం సహించదు. ఇక తమ కుటుంబం పట్ల అవిధేయత చూపించిన వాడిని మాత్రం ఊరికే వదిలిపెట్టదు. వారు సీనియర్లు జూనియర్లు కావచ్చు…. పార్టీకి ఎంతో సేవ చేసిన వారు కావచ్చు…. లేదా ఎటువంటి ఉపయోగం లేని లీడర్లు కావచ్చు..! ఎవరికైనా వీరు అవిధేయులు అని ముద్ర పడింది అంటే చాలు వారి అంతు చూసే దాకా వదిలిపెట్టరు అన్నది చరిత్ర మనకు చెబుతోంది

 

ఇదే అసలైన ప్లాన్

ఏ రోజైతే 23 మంది నేతలు సోనియాకు ఘాటు లేఖ రాశారో అప్పుడే వారందరికీ అవిధేయులుగా ముద్ర పడింది. ఇక తప్పించడానికి ఏదో కాడి కింద పడేసి నటించి ప్రక్షాళన చేసుకొని చివరికి తాపీగా పదవిని చేపట్టాలని రాహుల్ వ్యూహం అని తెలుస్తోంది. ఇది ఒక ప్రహసనం. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అంటున్నారు. ముందు సీడబ్ల్యూసీ మీటింగ్ పెట్టి అందులో బాగానే రాహుల్ నటించారు అన్న ఆరోపణలు భారీగా వస్తున్నాయి. రాహుల్, సోనియా సీనియర్ నేతనలని టార్గెట్ చేసేందుకే ఈ ఈ అధ్యక్ష పదవి డ్రామా ఆడారని చివరికి వారి కుటుంబమే పగ్గాలు చేపట్టి ఇప్పుడు ఒక్కొక్కరిగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవుల నుండి మర్యాద గా వెళ్ళగొడుతున్నారు అని అందరూ అంటున్నారు…. ఇదే అసలైన ప్లాన్ అట..!

అందరూ బకరాలు అయ్యారా?

మొన్న ఈ లేఖల విషయంలో చాలా గట్టిగా మాట్లాడిన గులామ్ నబీ ఆజాద్, అంబికా సోనీ, మోతిలాల్ వోరా చివరకు పార్లమెంటులో కాంగ్రెస్ వాణిని బలంగా వినిపించిన మల్లికార్జున కరిగే కూడా ప్రధాన కార్యదర్శి నుండి తొలగించబడ్డారు. అనుగ్రహ్ నారాయణ్ సింగ్, ఆశా కుమారి, గౌరవ గొగొయ్ తమకు కేటాయించిన రాష్ట్రాలలో పదవుల నుండి తొలగించబడ్డారు. ఆర్సీ కుంటియా తెలంగాణకు ఇన్చార్జిగా ఉండేవాడు…. అయితే అతనికి ఇష్టం వచ్చినట్లు పోస్ట్ ఇచ్చేశారు ఒక్కసారిగా తీసేసారు. అది ఎందుకో వారికే తెలియాలి. ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి గులామ్ నబీ ఆజాద్, అంబికా సోనీ లను తీసేసిన సరే సీడబ్ల్యూసీలో పదిలంగానే ఉన్నాయి అనుకోండి అది వేరే విషయం.

తెలంగాణ కథ ఏమిటి?

ఇక తెలంగాణ విషయానికి వస్తే…. సీనియర్ నేతలలో కూడా కాంగ్రెస్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థంకాక వణికిపోతున్నారు. ఉత్తమ్ కుమార్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ భంగ పడి టిఆర్ఎస్ బాగా లాభపడింది. ఇక ఎప్పటికప్పుడు అతనిని రిప్లేస్ చేస్తారని ప్రచారం జరుగుతూనే ఉన్నా దానిని కొనసాగించడం కాంగ్రెస్ ఎన్నికల్లో చతికిలపడడం చాలా సంవత్సరాలు నడుస్తూనే ఉంది. ఎంపీ ఎన్నికల్లో కొద్దోగొప్పో పరిణితి సాధించినా అది ఒక పక్క కూడా రాలేదు. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నిక గ్రేటర్ సహా మూడు ప్రధాన కార్పొరేషన్లు ఉన్నాయి.

అవి కూడా అయిపోయాక ఇక ఓడిపోవాల్సిన ఎన్నికలు ఏమీ లేవు కాబట్టి.. ఆ ఎన్నికల తర్వాత కొత్త పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని అందరిలో అనుమానం నెలకొంది. ఇంకంతే సోనియమ్మ ఆఫీస్ లో ఇలానే జరుగుతాయి వాటిని ఎవరు ఆపడానికి లేదు…. అడగడానికి లేదు!


Share

Related posts

మహాటీవీ నుంచి వైదొలిగిన పరకాల ప్రభాకర్… అసలేం జరిగిందంటే…

DEVELOPING STORY

YS Jagan: టీడీపీ అంటే వ‌ణికిపోతున్న జ‌గ‌న్‌…?

sridhar

బ్రేకింగ్: బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత..! టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్టు..!!

somaraju sharma