షూటింగ్ పూర్తి కాకుండా ఆగిపోయిన సినిమాలు ఇవే!

మనకు నచ్చిన హీరో కొత్త సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో చెప్పలేని ఆనందం. ఆ సినిమా ఎలా ఉంటుంది? ఏమిటి? తదితర విషయాలన్నింటినీ కూడా వెతికి మరీ ముందుగానే తెలుసుకుంటూ ఉంటారు. అంతగా అభిమానించే హీరోల సినిమాలు వస్తున్నాయని చెప్పి, మధ్యలోనే ఆగిపోతే అభిమానులకు ఎంతో నిరాశ మిగులుతుంది.

 

అలా మన హీరోల సినిమాలు షూటింగ్ తొలి దశలోనే ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. సగం షూటింగ్ జరిగిన సినిమాలు ఎన్నో సినిమాలు విచిత్ర చిత్ర కారణాలతో ఆగిపోయాయి. ఇలా ఆదిలోనే ఆగిపోయిన సినిమాలు ఏంటో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి:

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా రానిస్తున్నామెగాస్టార్ చిరంజీవి కొన్ని చిత్రాలు షూటింగ్ మొదలై ఆగిపోయాయి. వాటిలో భూలోక వీరుడు, ఆటో జానీ, వినాలని ఉంది ఈ తెలుగు చిత్రాలే కాకుండా అబు – బాగ్దాద్‌ గజదొంగ అనే హాలీవుడ్ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.

పవన్ కళ్యాణ్..

మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో అద్భుతమైన సినిమాలతో నటనతో కొన్ని కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఎంతో మంది దర్శకులు పవన్ తో సినిమా చేయాలని కథలు వినిపించారు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఇడియట్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వేరే హీరోలు నటించారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన జీసస్ క్రైస్ట్, సత్యాగ్రహి వంటి చిత్రాలు షూటింగ్ ప్రారంభంలోనే కొన్ని కారణాల ఆగిపోయాయి.

బాలకృష్ణ..

బాలకృష్ణ హీరోగా నర్తనశాల పేరుతో పౌరాణిక సినిమాలో షూటింగ్ ప్రారంభించారు. అయితే సౌందర్య మరణంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. విక్రమసింహ భూపతి, హర హర మహాదేవ చిత్రాలు కూడా చిత్రీకరణకు నోచుకోలేదు.

వెంకటేష్..

వెంకటేష్ కీలక పాత్రలో వంశీ దర్శకత్వంలో గౌరీ పురం రైల్వే స్టేషన్ సినిమా చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అయితే మారుతి దర్శకత్వంలో రాధ, తేజ దర్శకత్వంలో సావిత్రి వంటి సినిమాలు స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత ఆగిపోయిన సినిమాలు.

కమల్ హాసన్..

కమల్ హాసన్ కీలక పాత్రలో నటించిన మరుదనాయగమ్ అనే చిత్రం షూటింగ్ మొదలై ఆగిపోయింది. అయితే ఈ చిత్రం షూటింగ్ కు బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ ప్రారంభించడం విశేషం.

వీరు మాత్రమే కాకుండా రామ్ చరణ్ మెరుపు, మహేష్ పూరి కాంబినేషన్ లో జనగణమన ఎన్టీఆర్ లారెన్స్ చిత్రం పేదోడు ఇలా చర్చల దశలోనే ఆగిపోయిన సినిమాలు మరెన్నో ఉన్నాయి.