Indian 2: విలక్షణ నటుడు కమల్ హాసన్ కొత్త సినిమా “ఇండియన్ 2” సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని సినిమా మేకర్స్ తెలియజేస్తూ మూవీ టీంతో కమల్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఫిబ్రవరి లేదా జనవరి నెల చివరిలో ఈ సినిమా రిలీజ్ తేదీ.. ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ కీలకపాత్రలు పోషించడం జరిగింది. 2015వ సంవత్సరంలో డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు.
2018లో షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో నిర్మాతలు మరియు దర్శకుడు శంకర్ మధ్య అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ తెలియజేయగా అది షూటింగ్ జరుగుతున్న టైంలో పెరిగిపోవటంతో.. వివాదం నెలకొంది. 2020 కరోనా రాకముందు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. తమ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత శంకర్ వేరే సినిమా చేయాలని.. న్యాయస్థానం ఆశ్రయించగా దర్శకుడికి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఈ క్రమంలో కమల్ హాసన్ నటించిన “విక్రమ్” సినిమా 2022లో విజయం సాధించటం జరిగింది.
దీంతో “ఇండియన్ 2” సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయ్యేలా కమల్ వివాదాలను మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించారు. దీంతో చరణ్ సినిమా “గేమ్ చేంజర్” షూటింగ్ ఆపేసి శంకర్ ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. వాస్తవానికి 80 శాతం షూటింగ్ మొదట్లో కంప్లీట్ అయిపోయింది. మిగతా 20 శాతం కోర్టు వివాదం తర్వాత కమల్ చొరవతో తాజాగా కంప్లీట్ అయింది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ నుండి సినిమాకి సంబంధించి మెల్లమెల్లగా ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థల లైకా ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!