NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YV Subba Reddy: షర్మిల కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న వైవీ సుబ్బారెడ్డి .. అ వార్తలు అన్నీ అసత్యం

YV Subba Reddy: తాను వైఎస్ షర్మిలతో ఎటువంటి రాయబారం చేయలేదని వైఎస్ఆర్ సీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి తరపున కుటుంబ పెద్దగా వైవీ సుబ్బారెడ్డి షర్మిల వద్దకు రాయబారం జరిపారని మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. తాను ఎవరి కోసమూ షర్మిల తో రాయబారం చేయలేదన్నారు.

తాను రెండు మూడు వారాలకు ఒక సారి హైదరాబాద్ వెళుతుంటానని, కుటుంబ సభ్యులను కలుసుకుంటుంటానని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. అదే క్రమంలో విజయమ్మ అమెరికా నుండి వచ్చాక వెళ్లి కలిశానని వివరణ ఇచ్చారు. కానీ ఎల్లో మీడియా రాతలు పరాకాష్టకు చేరాయన్నారు. కుటుంబ సభ్యులనూ బజారుకీడ్చే పని చేస్తొందని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ అందరూ కలిసి కుట్రలు పన్ని ఇలాంటి వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు.

షర్మిల ముడేళ్ల క్రితం తెలంగాణ లో పార్టీ పెట్టారనీ, ఈ మధ్య కాంగ్రెస్ లో చేరుతున్నారని కూడా వస్తున్నాయని, దానిపై తమకు క్లారిటీ లేదన్నారు. షర్మిల కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఎందుకంటే .. తమకు ప్రజా మద్దతు ఉంది కాబట్టి ఎలాంటి కుట్రలు పన్నినా ప్రజల ఆశీర్వాదం తమ పార్టీకి, జగన్ కే ఉందని చెప్పారు.

జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలతో పేదల కుటుంబాల్లో మార్పు వచ్చిందని, తమకు ప్రజలే దేవుళ్లు అని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. ప్రజారంజకమైన పాలన అందిస్తున్నారు కాబట్టే వైసీపీకి ప్రజల మద్దతు ఉందని, ఈ సారి ఎన్నికల్లోనూ మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైవీ ధీమా వ్యక్తం చేశారు.

YSRCP: వైసీపీకి సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా.. టీడీపీలో చేరేందుకు మంతనాలు

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju