NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా.. టీడీపీలో చేరేందుకు మంతనాలు

YSRCP: అనకాపల్లికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డికి పంపించారు. రాజీనామాకు ముందు అనకాపల్లిలో వీరభద్రరావు తన వర్గీయులతో సమావేశమైయ్యారు. అనంతరం తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించారు.

తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు దాడి వీరభద్రరావు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని, ఏ పార్టీలోచేరేది అప్పుడు చెబుతానని దాడి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరే సమయంలో అనేక హామీలు ఇచ్చారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేశారన్నారు. కనీసం కలిసేందుకు కూడా సీఎం జగన్ అవకాశం ఇవ్వలేదన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దాడి వీరభద్రరావు .. 1985 నిం 1999 వరకూ వరుసుగా నాలుగు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చేతిలో, 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్ధి చేతిలో దాడి వీరభద్రరావు పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత  అనూహ్యంగా 2014కు ముందు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత పలు మార్లు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

తిరిగి 2019 ఎన్నికలకు ముందు మరో సారి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు. ఈ క్రమంలో ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మరో మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరణంలో దాడి వీరభద్రరావు వైసీపీని వీడారు. టీడీపీలో చేరేందుకు దాడి వీరభద్రరావు ఇప్పటికే చంద్రబాబుతో మాట్లాడినట్లుగా తెలుస్తొంది. ఆయన కుమారుడు చంద్రబాబు, లోకేష్ తో కలిసి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

WhatsApp: భారత్ లో 75 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్ .. కారణం ఏమిటంటే..?

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju