Salaar: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా “సలార్” గురించే చర్చ జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఐదు సంవత్సరాల తర్వాత ప్రభాస్ హిట్ అందుకోవటం. 2018లో “బాహుబలి”తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బాక్సులు బద్దలు కొట్టడంతో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభాస్ చేసిన మూడు సినిమాలు సాహో, రాదేశ్యామ్, ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రభాస్ ఇమేజ్ డౌన్ అవుతున్న సమయంలో “KGF” దర్శకుడు ప్రశాంత్ నీల్ “సలార్” సినిమా ప్రకటించటం సంచలనం సృష్టించింది. అప్పటికే “KGF” సినిమాలతో దేశము మొత్తం.. తన వైపు చూసేలా తన దర్శకత్వ పనితీరును మంచిగా ప్రశాంత్ నీల్ కనబరిచారు.
ఈ క్రమంలో “బాహుబలి” సినిమాతో బాక్సాఫీస్ కింగ్ గా మారిన ప్రభాస్ తో “సలార్” సినిమా చేసి.. రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం మరింత సంచలనం సృష్టించింది. ఈ సినిమా షూటింగ్ ఈ సినిమా షూటింగ్.. ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద హడావిడి లేకుండా జరిగాయి. కానీ “సలార్” బొమ్మ థియేటర్ లో పడిన తర్వాత రీ సౌండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. “సలార్” హిట్టు దెబ్బకి రికార్డులు గల్లంతవుతున్నాయి. ఈ క్రమంలో “సలార్” టైటిల్ కి అర్థమేమిటో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల వివరించడం జరిగింది. ఈ పదానికి సమర్థవంతమైన నాయకుడు అని అర్థం అంటూ తెలియజేశారు. అంతేకాదు రాజుకి కుడి భుజంగా ఉంటూ.. అత్యంత నమ్మకంగా ఉండే వ్యక్తిని “సలార్” అని పిలుస్తారని నీల్ తెలియజేయడం జరిగింది.
“సలార్” సినిమాతో మంచి హిట్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. “KGF” రెండు సినిమాల కంటే ఈ సినిమాతో మరింతగా ప్రశాంత్ నీల్ కి పేరు రావడం జరిగింది. ముఖ్యంగా ఎలివేషన్స్ రేంజ్ లో అంటున్నారు. ప్రభాస్ కెరియర్ లో ఏ దర్శకుడు చూపించండి విధంగా ప్రశాంత్ నీల్ చూపించాడని స్పష్టం చేస్తున్నారు. ప్రభాస్ చెప్పినట్టుగానే బెస్ట్ డైరెక్టర్.. అంటూ కామెంట్ చేస్తున్నారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!