Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం “గేమ్ ఛేంజర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు ఏడాదిన్నర నుండి సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్ 3 డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో నిర్మాత దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చరణ్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు సంబంధించి తాజాగా దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. శనివారం ప్రభాస్ నటించిన “సలార్” సినిమా హైదరాబాద్ లోగో ధియేటర్లో చూడడం జరిగింది.
సినిమా చూసి వచ్చేస్తూ ఉన్న సమయంలో థియేటర్ బయట ఆడియన్స్ “గేమ్ ఛేంజర్” అప్ డేట్ ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్ నెలలో రిలీజ్ అని దిల్ రాజు ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. దీంతో చరణ్ ఫాన్స్ మరీ అంత లేటా అని తాజా వార్త కొద్దిగా నిరుత్సాహం చెందుతున్నారు. మరోపక్క ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. “గేమ్ ఛేంజర్” సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో… సెకండ్ పార్ట్ చేయాలని కథలో మార్పులు చేస్తే బాగుంటుందని దిల్ రాజు … సూచించినట్లు దర్శకుడు శంకర్ మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో చరణ్ రాజకీయ నాయకుడిగా ఇంకా స్టూడెంట్ మరియు కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ నేపథ్యం కలిగిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని అంటున్నారు. హీరోయిన్ గా కియరా అద్వానీ నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. “RRR” తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమా పై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. “RRR” చరణ్ కి గ్లోబల్ మార్కెట్ క్రియేట్ చేయడంతో ఆ దిశగానే “గేమ్ ఛేంజర్” సినిమా రిలీజ్ చేయబోతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!