వ‌రుస వాయిదాలు.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే ` కార్తికేయ 2 ` హిట్టే!

Share

కార్తికేయ 2  యంగ్ హీరో నిఖిల్‌, చందు మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `కార్తికేయ‌` చిత్రం 2014లో విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా `కార్తికేయ 2` రాబోతోంది. ఇందులో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తే.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 22న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ, కుద‌ర‌లేదు, జూలై 29న అనుకున్నా.. అదీ జ‌ర‌గ‌లేదు. ఇక ఆగ‌స్టు 12న రిలీజ్ డేట్‌ను ఖాయం చేసుకున్నారు. అయితే మ‌ళ్లీ ఏమేందో ఏమో గానీ ఆగ‌స్టు 13కు విడుద‌ల‌ను పోస్ట్ పోన్ చేసి.. జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

నిఖిల్ `కార్తికేయ 2` మ‌ళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ ఇదే!

ఇలా వ‌రుస వాయిదాలు ప‌డుతుండ‌టంతో.. `కార్తికేయ 2`పై ఓ సెంటిమెంట్ బ‌లంగా వినిపిస్తోంది. అదేంటంటే.. గ‌తంలో `కార్తికేయ‌` రిలీజ్‌కు ఇలానే అనేక అడ్డంకులు ఎదుర‌య్యాయి. అయితే ఎలాగోలా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. నిఖిల్ కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తిండి పోయే చిత్రంగా నిలిచింది.

అలాగే నిఖిల్ హీరోగా తెర‌కెక్కిన `ఎక్కడికి పోతావు చిన్నవాడ`, `అర్జున్ సురవరం` చిత్రాలు కూడా అనేక సార్లు వాయిదా ప‌డ్డాయి. క‌ట్ చేస్తే ఈ రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ఇక ఇప్పుడు కూడా ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే.. `కార్తికేయ 2` హిట్టే అవుతుంద‌ని సినీ ప్రియులు భావిస్తున్నారు.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

32 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

41 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago