Bigg Boss 7: బిగ్‌బాస్ సీజన్-7లో 14 మంది కంటెస్టెంట్లలో రతిక రోజ్ ఒకరిగా ఎంట్రీ ఇచ్చింది. షోలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటున్నారు. పాటలు పాడుతూ.. యూట్యూబర్ పల్లవి ప్రశాంత్‌తో చనువుగా ఉంటూ సందడి చేస్తోంది. ఎంతో చలాకీగా కనిపిస్తున్న ఈ బ్యూటీ గుండెల్లో కూడా ఎంతో బాధను మోస్తుందని రీసెంట్ ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతోంది. సీజన్ ప్రారంభమైన మొదటి రోజే బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున.. రతిక రోస్ బ్రేకప్ గురించి ఆరా తీస్తూ వస్తున్నారు. మొదటి రోజే తన బ్రేకప్ గురించి నాగార్జున ఆరా తీశారు. బ్రేకప్ నుంచి బయటకు వచ్చావా? అని నాగార్జున అడిగినప్పుడు.. రతిక రోజ్ హా అని నవ్వుతూనే.. ‘చేసిందంతా చేసి ఇప్పుడు ఎంత బాగా నవ్వుతున్నారో? అని బదులిచ్చింది. ఆ మాటలకు కంగుతిన్న నాగార్జున ‘నేనేం చేశాను.’ అని అడిగారు. దానికి రితిక ‘మొత్తం మీరే చేశారు.. ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు నా బ్రేకప్ స్టోరీ గురించి అడుగుతున్నారు.’ అని చెప్పుకొచ్చింది.

పునర్నవి వల్లే విడిపోయారా?
సరే.. నేనేం చేశానో చెప్పమని నాగార్జున అడిగినప్పుడు.. ‘బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లాక తెలుస్తుంది.’ అని మాటను దాటేస్తుంది. సరే నీ హార్ట్ బ్రేక్ చేసిన వాడిని ఇమిటేట్ చేయమని అడిగినప్పుడు .. ఇప్పుడు పాటలు పాడాలా? అని రతిక రోజ్ అడుగుతుంది. అప్పుడే అర్థమవుతుంది. రతిక రోజ్ మనసును ముక్కలు చేసింది మరెవరో కాదు.. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అని. అయితే రీసెంట్ ఎపిసోడ్‌తో అది కన్‌ఫర్మ్ అని తేలిపోయింది. ‘పిల్లా.. పిల్లా.. భూలోకం దాదాపు కన్నుమూయూ వేళా’ అనే పాటను ప్రోమోగా వదిలి బిగ్‌బాస్ ప్రేక్షకులకు హింట్ ఇచ్చాడు.

రాహుల్‌తో పరిచయం అప్పుడే..
అప్పట్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లుగా రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం షోలోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో పునర్నవి భూపాలం కోసం ‘పిల్లా.. పిల్లా.. భూలోకం దాదాపు కన్నుమూయూ వేళా..’ అనే పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. తాజా ఎపిసోడ్‌లో ఆ పాటను బిగ్‌బాస్ మళ్లీ ప్లే చేయడంతో నెటిజన్లలో డౌట్ మొదలైంది. దాంతో సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్, రతిక రోజ్ రిలేషన్‌షిప్ నిజమేనని బోలెడన్ని ఫోటోలు దర్శనమిస్తున్నాయి. సినిమాల్లో పాటలు పాడకన్న ముందు రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేవాడు. ‘హే పిల్ల’ ఆల్బమ్ సమయంలోనే రాహుల్, రతిక మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్ షో వల్లే బ్రేకప్ అయిందా?
బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవితో ప్రేమాయణం నడిపాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని భారీగానే ప్రచారం జరిగింది. అప్పుడు రాహుల్, రతిక మధ్య పొరపచ్చాలు వచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడు వీరు విడిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. బిగ్‌బాస్ సీజన్-3లో రాహుల్-పునర్నవి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని అప్పటి హోస్ట్ నాగార్జునే కామెంట్లు చేసేవాడు. ప్రస్తుత ఎపిసోడ్‌లో తనకేమి తెలియదన్నట్లు నాగార్జున కామెంట్లు చేయడంపై రతిక రోజ్ కాస్త సీరియస్ అయినట్లే కనిపిస్తోంది.

గతాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డ రతిక..
తాజా ఎపిసోడ్‌లో రతిక రోజ్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ హాల్‌కు పిలుస్తారు. అక్కడ రతిక కోసం కాపీ కూడా ఇస్తారు. మెల్లగా మాట్లాడుతూ.. రతికను ‘మీరు బాగానే ఉన్నారా? ఏదైనా మిస్ అవుతున్నారా?’ అని బిగ్‌బాస్ అడిగారు. దానికి రతిక.. ‘అవును బిగ్‌బాస్.. మనం దూరంగా ఉన్నప్పుడు ఒంటరిగా బాధపడుతున్నానంటే తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నారని, కానీ తల్లిదండ్రులు పక్కన ఉన్నా.. నేను మిస్ అవుతున్నామంటే అది నాకు ప్రత్యేకమైన మనిషి కోసమే. చాలా వరకు నా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటాను. కానీ ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు నేను మెంటల్లీ డిస్టర్బ్ అవుతాను.’ అని కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడూ హౌజ్‌లో అల్లరి చేస్తూ సరదాగా నవ్వించే రతికకు ఇన్ని కష్టాలా అని ఆశ్చర్యపోతున్నారు.